Rega Kantharao | సీతారామ నుంచి సాగునీటి పరవళ్లు.. రేగా కాంతారావు హర్షం
Rega Kantharao | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సాగునీటి కోసం జలాలను విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమతోంది.
Rega Kantharao | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సాగునీటి కోసం జలాలను విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమతోంది. కేసీఆర్ ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పంట భూములకు సాగునీరు అందుతోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంతోషం వ్యక్తం చేశారు. నీటి పరవళ్లను చూస్తూ ఆయన పులకించిపోయారు. తాజాగా ఈ ప్రాజెక్టులోని బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు.
కేసీఆర్ ముందుచూపుతోనే రైతుల పంట భూములకు సాగునీరు అందుతుందని రేగా కాంతారావు అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను కేసీఆర్ ముందుగానే అంచనా వేశారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఎలాంటి కరవు వచ్చినా సీతారామ కెనాల్ ద్వారా ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగు నీరు అందించొచ్చని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ గారి ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పంట భూములకు సాగునీరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా, కేసీఆర్ మానస పుత్రికగా పేరుగాంచిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంపై బీఆర్‌ఎస్ పార్టీ… pic.twitter.com/ugOgbhPytj
— BRS Party (@BRSparty) July 11, 2026
తాజావార్తలు
- ●Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
- ●Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు
- ●Toxic OTT | ట్రిమ్ వెర్షన్తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ - బోల్డ్ సీన్లు కట్!
- ●Rashmika Mandanna | షూటింగ్ అంటేనే వణికిపోయా - మైసాపై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Stock Markets | మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ.. 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు

Toxic OTT | ట్రిమ్ వెర్షన్తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ - బోల్డ్ సీన్లు కట్!






