PM Modi | చెన్నైలో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
PM Modi | బిగ్ బాష్ లీగ్ (Big Bash League) 2026-27 ప్రారంభ మ్యాచ్ చెన్నై (Chennai)లోని చిదంబరం స్టేడియంలో (Chidambaram Stadium) జరగనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రకటన చేశారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రకటన చేశారు. బిగ్ బాష్ లీగ్ (Big Bash League) 2026-27 ప్రారంభ మ్యాచ్ చెన్నై (Chennai)లోని చిదంబరం స్టేడియంలో (Chidambaram Stadium) జరగనుందని ప్రకటించారు. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ఈ కీలక ప్రకటన చేశారు.
భారత్–ఆస్ట్రేలియా మధ్య క్రీడా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘జీ’డే నమస్తే’ ( 'G'day Namaste) కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ఆస్ట్రేలియా వెలుపల మరో దేశంలో జరగడం ఇదే తొలిసారి. చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ జరగనుండటం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ఆశిస్తున్నట్లు బీబీఎల్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తుందని, ముఖ్యంగా చెన్నైలో క్రికెట్‌కు అపారమైన ఆదరణ ఉండటంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోతుందని సీఏ బిగ్‌బాష్ లీగ్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డోబ్బన్ తెలిపారు.
ఇక 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్‌లను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ






