PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) న్యూజిలాండ్ (New Zealand) చేరుకున్నారు. శుక్రవారం ఆక్లాండ్‌లో (Auckland) ల్యాండ్ అయ్యారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి (first visit by an Indian PM).
PM Modi | మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) న్యూజిలాండ్ (New Zealand) చేరుకున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలను ముగించుకుని ఆయన శుక్రవారం ఆక్లాండ్‌లో (Auckland) ల్యాండ్ అయ్యారు.
దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి (first visit by an Indian PM). ఫలితంగా నాలుగు దశాబ్దాల విరామం తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ (Christopher Luxon) స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇరు దేశాధినేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
2025 మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత్‌ను సందర్శించిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటనలో ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత విస్తరించే మార్గాలపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కూడా పురోగతి సాధించాలన్న దిశగా చర్చలు జరపనున్నారు. రేపు ఉదయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు.
#WATCH | PM of New Zealand Christopher Luxon hugs PM Narendra Modi, as he arrives in Auckland, New Zealand for the final leg of his three-nation visit.
(Video: ANI/DD) pic.twitter.com/r5e379h19H
— ANI (@ANI) July 10, 2026
తాజావార్తలు
- ●Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు
- ●Stock Markets | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..
- ●ఓటీటీలు, డిజిటల్ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు వాడుతున్నారా?.. మన దృష్టికి రాకుండానే కరుగుతున్న జీతం!
- ●Dhatura | ఆన్లైన్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
- ●Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు

Stock Markets | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..

ఓటీటీలు, డిజిటల్ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు వాడుతున్నారా?.. మన దృష్టికి రాకుండానే కరుగుతున్న జీతం!






