త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | రామ్‌చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ – కోయంబ‌త్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్‌సీ 17 షూటింగ్ ఆల‌స్యం?

పెద్ది షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ రామ్‌చ‌ర‌ణ్‌కు సోమ‌వారం స‌ర్జ‌రీ జ‌రుగ‌నుంది. ఈ స‌ర్జ‌రీ కోసం కోయంబ‌త్తూరు వెళ్లారు. అత‌డి వెంట చిరంజీవి, సురేఖ‌తో పాటు ఉపాస‌న కూడా వెళ్లిన‌ట్లు స‌మాచారం. స‌ర్జ‌రీ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ రెండు నుంచి మూడు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకోనున్న‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Jul 26, 2026, 4.55 pm IST

Ram Charan | రామ్‌చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ – కోయంబ‌త్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్‌సీ 17 షూటింగ్ ఆల‌స్యం?
Advertisement

Ram Charan | పెద్ది మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ జ‌రుగ‌నుంది. ఈ స‌ర్జ‌రీ కోసం రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మెగా ఫ్యామిలీ ఆదివారం కోయంబ‌త్తూరు బ‌య‌లుదేరారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్ రెజ్ల‌ర్‌గా క‌నిపించారు. రెజ్లింగ్ సీన్లు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో మ‌ణిక‌ట్టుకు తీవ్ర గాయ‌మైంది. కార్టిలేజ్ టియ‌ర్ అనే స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు స‌మాచారం.

కోయంబ‌త్తూరులో...

మ‌ణిక‌ట్టు గాయానికి సోమ‌వారం కోయంబ‌త్తూరులోని గంగా హాస్పిట‌ల్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ జ‌రుగ‌నుంది. మే నెల‌లోనే ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాల‌ని అనుకున్నారు. కానీ పెద్ది మూవీ ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా వాయిదాప‌డింది. ఈ స‌ర్జ‌రీ కోసం ఆదివారం కోయంబ‌త్తూరు బ‌య‌లుదేరారు రామ్‌చ‌ర‌ణ్‌. ఆయ‌న వెంట చిరంజీవి, సురేఖ‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కూడా కోయంబ‌త్తూరు వెళ్లారు.

గంగా హాస్పిట‌ల్...

అర్దోపెడిక్ ట్రీట్‌మెంట్‌కు గంగా హాస్పిట‌ల్ ఇండియాలోనే ఫెమ‌స్‌. అందుకే చ‌ర‌ణ్ కోయంబ‌త్తూరులో స‌ర్జ‌రీ చేయించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ నేతృత్వంలో రామ్‌చ‌ర‌ణ్‌కు ట్రీట్‌మెంట్ జ‌రుగ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. స‌ర్జ‌రీ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ రెండు నుంచి మూడు నెల‌ల‌ పాటు విశ్రాంతి తీసుకోనున్న‌ట్లు తెలిసింది. పెద్ది త‌ర్వాత సుకుమార్‌తో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీతో చేయ‌బోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని అనుకున్నారు. కానీ స‌ర్జ‌రీ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

మిక్స్‌డ్ టాక్‌...

పెద్ది మూవీలో మ‌ణిక‌ట్టు గాయంతో రామ్‌చ‌ర‌ణ్ కంటికి కూడా దెబ్బ త‌గిలింది. కంటి గాయం కార‌ణంగా కొద్ది రోజులు పెద్ది షూటింగ్ నిలిచిపోయింది. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన పెద్ది థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కు మాత్రం ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

 

Advertisement
Advertisement