త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagtial | మ‌ల్యాల‌లో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు

Jagtial | జ‌గిత్యాల (Jagtial) జిల్లా మల్యాల (Malyala)మండల కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బంగారు గుండు (Gold) కోసం చితి మంటలు పూర్తిగా ఆరిపోకముందే ఇద్దరు దుండగులు నీళ్లు చల్లి బూడిదను (Cremation Ashes) సంచుల్లో ఎత్తుకెళ్లారు.

G

Telangana | Published On Jul 26, 2026, 5.05 pm IST

Jagtial | మ‌ల్యాల‌లో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
Advertisement

Jagtial | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌గిత్యాల (Jagtial) జిల్లా మల్యాల (Malyala)మండల కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బంగారు గుండు (Gold) కోసం చితి మంటలు పూర్తిగా ఆరిపోకముందే ఇద్దరు దుండగులు నీళ్లు చల్లి బూడిదను (Cremation Ashes) సంచుల్లో ఎత్తుకెళ్లారు. మల్యాల‌కు చెందిన ఓ మ‌హిళ మృతిచెందింది. దీంతో కుటుంబ స‌భ్యులు ఆమె అంత్య‌క్రియ‌లు ముగించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత శ్మశానానికి వ‌చ్చిన ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు.. మహిళ తల భాగంపై నీరు పోసి మంటలు ఆర్పివేసి బూడిదను ఎత్తుకెళ్లారు. గమనించిన స్థానికులు వారిని వెంబడించడంతో వారు బూడిద సంచులను వదిలేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

మహిళలు మృతిచెందినప్పుడు వారు ధరించే నల్లపూసల ఆభరణంలోని చిన్న బంగారు గుండును మృతురాలి నోట్లో ఉంచి దహన సంస్కారాలు నిర్వహించ‌డం సంప్ర‌దామ‌ని స్థానికులు వెల్ల‌డించారు. దీనిని ఆసరాగా చేసుకుని దాదాపు రూ.10 వేల విలువైన బంగారు గుండు కోసం దుండగులు చితి బూడిదను ఎత్తుకెళ్లిన‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement