త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S-400 Missiles | భార‌త్‌కు చేరిన ఎస్‌-400 నాలుగో యూనిట్.. ఇక మ‌న‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత ప‌టిష్టం

S-400 Missiles | భారత్ వైమానిక రక్షణ వ్యవస్థ మ‌రింత ప‌టిష్టం కానుంది. గ‌తేడాది ఆపరేషన్ సిందూర్ స‌మ‌యంలో కీలక పాత్ర పోషించిన శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ ఎస్‌-400 నాలుగ‌వ మిస్సైల్ (S-400 Missiles) సిస్ట‌మ్ ఇండియాకు చేరుకుంది.

D

National | Published On Jun 4, 2026, 1.57 pm IST

S-400 Missiles | భార‌త్‌కు చేరిన ఎస్‌-400 నాలుగో యూనిట్.. ఇక మ‌న‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత ప‌టిష్టం
Advertisement

S-400 Missiles | భారత్ వైమానిక రక్షణ వ్యవస్థ మ‌రింత ప‌టిష్టం కానుంది. గ‌తేడాది ఆపరేషన్ సిందూర్ స‌మ‌యంలో కీలక పాత్ర పోషించిన శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ ఎస్‌-400 నాలుగ‌వ మిస్సైల్ (S-400 Missiles) సిస్ట‌మ్ ఇండియాకు చేరుకుంది. దీన్ని ర‌ష్యా (Russia) నుంచి కొనుగోలు చేశారు. ప‌లు ర‌కాల క్షిప‌ణులు, లాంచ‌ర్లు, సెన్సార్లు, రేడార్లు ఆ సిస్ట‌మ్‌లో ఉన్నాయి. ఈ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌కు చెందిన ప‌రిక‌రాల‌ను ఇక్క‌డే అసెంబ్లింగ్ చేయ‌నున్నారు.

ఇండియాకు రష్యా అందిస్తున్న వాటిలో ఎస్‌–400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (S-400 air defence system) కీలకమైనవి. ఈ వ్యవస్థ గగనతలంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లను కూడా అత్యంత కచ్చితత్వంతో ముందే పసిగట్టి కూల్చివేయగలదు. వీటిని అందించే విషయంలో 2018లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఐదు ఎస్‌–400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని ఇండియాకు రష్యా అందించాలి. ఇప్ప‌టికే మూడు యూనిట్లను భార‌త్ అందుకుంది. వీటిని చైనా, పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో మోహ‌రించారు. ఇక ఐదో యూనిట్ నవంబర్ నాటికి అందే అవకాశం ఉందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ఆపరేషన్‌ సిందూర్ స‌మ‌యంలో క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఎస్‌-400’ తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించిన విష‌యం తెలిసిందే. దాయాది పంపిన మిస్సైల్స్‌ను విజ‌య‌వంతంగా అడ్డుకున్న నేప‌థ్యంలో.. మ‌రికొన్ని యూనిట్ల‌ను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థల నిర్వహణపై రష్యా ఇప్పటికే భారత సైనికులకు శిక్షణ ఇచ్చింది. ఎస్-400 ట్రయంఫ్ సిస్ట‌మ్.. గగనతల లక్ష్యాలను కూల్చగల మిస్సైల్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్‌తో భారత్ వైమానిక రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

Also Read..

పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!

నీ ఊరేది.. నీ క‌థేంటి..? ప్ర‌కాశ్ రాజ్‌పై బండ్ల గ‌ణేశ్ ఫైర్‌

రేప‌ట్నుంచి 'ప‌ది' అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

Advertisement
Advertisement