త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tenth Exams | రేప‌ట్నుంచి ‘ప‌ది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

Tenth Exams | ఈ నెల 5 నుంచి తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్ర‌వారం నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు ప‌ది ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది.

S

Telangana | Published On Jun 4, 2026, 12.48 pm IST

Tenth Exams | రేప‌ట్నుంచి ‘ప‌ది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..
Advertisement

Tenth Exams | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 5 నుంచి తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్ర‌వారం నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు ప‌ది ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది.

టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.50 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ ప‌రీక్ష‌లు రెండు వేర్వేరు రోజుల్లో ఉద‌యం 9.30 నుంచి ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు హాల్ టికెట్ల‌ను బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. లేదా సంబంధిత స్కూల్ ప్రిన్సిప‌ల్ వ‌ద్ద తీసుకోని ప‌రీక్ష‌ల‌కు హాజరు కావొచ్చు. ఈ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 31,542 మంది హాజ‌రు కానున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం 040-23230942 నంబ‌ర్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement