Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Chirumarthi Lingaiah | కేసీఆర్ గురించి వేముల వీరేశం మాట్లాడితే సూర్యుడు మీద ఉమ్మేసినట్లు అవుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. కేసీఆర్ భిక్షపెడితేనే ఈరోజు వేముల వీరేశం విప్ కుర్చీలో కూర్చున్నాడని చెప్పారు.
- కేసీఆర్ భిక్షతోనే వేముల వీరేశం విప్ అయ్యిండు
- కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఏదేదో మాట్లాడుతుండు
- నకిరేకల్‌లో భూ మాఫియాలు ఎక్కువయ్యాయి
- బీఆర్ఎస్‌ను చూస్తే కాంగ్రెసోళ్లకు లాగులు తడుస్తున్నయ్
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Chirumarthi Lingaiah | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ గురించి వేముల వీరేశం మాట్లాడితే సూర్యుడు మీద ఉమ్మేసినట్లు అవుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరేశంపై నిప్పులు కక్కారు. కేసీఆర్ భిక్షపెడితేనే ఈరోజు వేముల వీరేశం విప్ కుర్చీలో కూర్చున్నాడని చెప్పారు. ఆయన ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. సమాజం పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు జోడెద్దుళ్లా పని చేస్తున్నారని.. అందుకే బీఆర్ఎస్ పార్టీని చూస్తే కాంగ్రెస్ వాళ్లకి లాగులు తడుస్తున్నాయన్నారు.
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు.. ఈ మధ్య కాలంలో విప్ అయిన వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వేముల వీరేశం ఎన్నడు ఉద్యమంలో పాల్గొనలేదు. కేసీఆర్ భిక్షతో 2014 లో 1200 ఓట్లతో గెలిచాడు. సమాజం పట్ల గౌరవం లేని వ్యక్తి వేముల వీరేశం. ఆయన సొంత గ్రామంలో అడిగితే దళితులు అన్ని విషయాలు చెప్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడే నైతిక అర్హత వీరేశంకు లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భిక్షతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అని మాజీ ఎమ్మెల్యే లింగయ్య గుర్తు చేశారు.
వేముల వీరేశం దుర్మార్గుడు..
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల్లో కొత్త ఆయకట్టు వచ్చింది. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఓపెన్ చేసిన ఉదయ సముద్రం ప్రాజెక్టును మళ్లీ మళ్లీ ఓపెన్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో వీరేశం ఆగడాలు ఎక్కువైపోయాయి. నకిరేకల్ లో భూ మాఫియా, మట్టి మాఫియా ఆగడాలు ఎక్కువైపోయాయి. చెరుకుపల్లి గ్రామంలో వందల వాహనాల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. దుర్మార్గుడైన వేముల వీరేశంకు విప్ ఇచ్చారు. ఆయన భార్య పుష్ప కళాకారిణి కాదు. దళితులను మోసం చేస్తున్న వ్యక్తి ఆయన అని లింగయ్య ఫైరయ్యారు.
అద్దంకికి నోటి దురుసు ఎక్కువ..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం భూములను కబ్జాలు చేసే పనిలో ఉన్నారు. వేముల వీరేశంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బాల్క సుమన్, క్రిశాంక్ ల పై అక్రమ కేసులు పెడుతున్నారు. అద్దంకి దయాకర్ కు నోటి దురుసు ఎక్కువ అని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Gutha Sukhender Reddy | ముందు నీ భాష మార్చుకో.. పవన్ కల్యాణ్‌కు మండలి చైర్మన్ చురక
జూన్ 4, 2026

Harish Rao | పోలవరం పూర్తయితే భద్రాచలానికి నిత్యం జలగండమే: హరీశ్‌రావు
జూన్ 4, 2026

Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..
- ●Gutha Sukhender Reddy | ముందు నీ భాష మార్చుకో.. పవన్ కల్యాణ్‌కు మండలి చైర్మన్ చురక
- ●Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ - ఒప్పుకొని... తప్పుకోవడంపై అనుమానాలు?
- ●NEET Aspirant | మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి..
- ●Harish Rao | పోలవరం పూర్తయితే భద్రాచలానికి నిత్యం జలగండమే: హరీశ్‌రావు
- ●Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్

Stock Markets | ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..

Gutha Sukhender Reddy | ముందు నీ భాష మార్చుకో.. పవన్ కల్యాణ్‌కు మండలి చైర్మన్ చురక

Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ - ఒప్పుకొని... తప్పుకోవడంపై అనుమానాలు?

NEET Aspirant | మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి..



