త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia Electro-L Satellite | రష్యన్ శాటిలైట్ కంటికి చిక్కిన భారత్.. ఆకుపచ్చని మెరుపుతో అద్భుతమైన దృశ్యం!

భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రష్యా 'ఎలక్ట్రో-ఎల్' వాతావరణ ఉపగ్రహం భారతదేశాన్ని తన కెమెరాలో బంధించింది. సాధారణంగా మనం చూసే రంగులకు భిన్నంగా, ఈ ఫోటోలో భారత్ ఎంతో అందంగా, ఆకుపచ్చ రంగులో మెరుస్తూ కనిపించింది.

J

National | Published On May 3, 2026, 9.00 pm IST

Russia Electro-L Satellite | రష్యన్ శాటిలైట్ కంటికి చిక్కిన భారత్.. ఆకుపచ్చని మెరుపుతో అద్భుతమైన దృశ్యం!
Advertisement

Russia Electro-L Satellite | ఆకాశం నుంచి చూస్తే మన దేశం మరోలా కనిపిస్తుంది. రాత్రి పూట ఒకలా, మధ్యాహ్నం మరోలా, ఉదయం ఇంకోలా కనిపిస్తుంది. వర్షాకాలం, చలికారం, ఎండాకాలంలోనూ రకరకాలుగా మన దేశం అంతరిక్షం నుంచి కనిపిస్తుంటుంది. తాజాగా రష్యాకు చెందిన ఎలక్ట్రో ఎల్ శాటిలైట్ భారత్ ఫోటోను తీసింది. ఎండాకాలంలోనూ భారత్ ఆకుపచ్చని రంగులో మెరిసిపోతూ కనిపించే అద్భుతమైన దృశ్యాన్ని అది క్లిక్‌మనిపించింది.

భూమికి 36 వేల కిమీల ఎత్తులో నుంచి

రష్యా ఎలక్ట్రో ఎల్ అనే శాటిలైట్ భూమికి 36 వేల కిమీల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి తన కెమెరాలో భారత్‌ను బంధించింది. సాధారణంగా మనం చూసే రంగులకు భిన్నంగా, భారత్ ఎంతో అందంగా ఈ ఫోటోలో కనిపించింది. అయితే.. శాటిలైట్‌లో ఉన్న ఇన్‌ఫ్రారెడ్ రేస్ వల్లనే మన భారత్ అలా ఆ రంగులో కనిపించినట్లు రష్యా తెలిపింది. వాతావరణంలో జరిగే మార్పులను పసిగట్టేందుకు, మేఘాల కదలికలను తెలుసుకోవడం ఈ శాటిలైట్ ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను వాడుతుంది. అది ఫోటో తీసినప్పుడు ఇన్‌ఫ్రారెడ్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను వినియోగించడం వల్ల అలా మన దేశం ఆకుపచ్చని రంగులో మెరిసిపోతూ కనిపించింది. అంతే కానీ.. మండే ఎండాకాలంలోనూ మన దేశం ఆకుపచ్చగా ఉందా అని మనం పప్పులో కాలేయాల్సిన అవసరం లేదు.

Advertisement
Advertisement