త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vladimir Putin | డ్రోన్ దాడుల‌ భ‌యం.. కొన్ని వారాలుగా బంక‌ర్ల‌లో దాక్కున్న‌ పుతిన్..!

Vladimir Putin | ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే డ్రోన్ దాడుల భ‌యంతో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కొన్ని వారాలుగా బంక‌ర్ల‌లో దాక్కున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు తెలిపాయి. నోవ్‌గోరోడ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ నివాసంలో పుతిన్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ట్లు పేర్కొన్నాయి. దీంతో కొన్ని నెల‌లుగా రష్యా ఫెడరల్ రక్షణ విభాగం అధ్య‌క్షుడి భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచింది.

D

International | Published On May 8, 2026, 1.04 pm IST

Vladimir Putin | డ్రోన్ దాడుల‌ భ‌యం.. కొన్ని వారాలుగా బంక‌ర్ల‌లో దాక్కున్న‌ పుతిన్..!
Advertisement

Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు ప్రపంచంలోనే అత్యంత బలమైన భద్రతా వలయం ఉంటుంది. అయినా, ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నోవ్‌గోరోడ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ నివాసంలో పుతిన్‌ను అంతం చేసేందుకు శ‌త్రువులు ప్ర‌య‌త్నించిన‌ట్లు మాస్కో అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న కొన్ని నెల‌ల కింద‌టే జ‌రిగింద‌ని.. అయితే, భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌ని పేర్కొన్నాయి.

ఉక్రెయిన్‌తో యుద్ధం (Ukraine war) సాగిస్తున్న పుతిన్‌పై కీవ్‌ డ్రోన్ల‌తో అటాక్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు మాస్కో అధికారులు తెలిపారు. దీంతో ఆయ‌న కొన్ని వారాలుగా బంక‌ర్ల‌లోనే (Bunkers) దాక్కున‌ట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు ప్రస్తుతం యుద్ధ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఎక్కువ సమయం భూగర్భ బంకర్లలోనే గడుపుతున్నారని యూరోపియన్ ఇంటెలిజెన్స్‌కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. అధ్య‌క్షుడు ఉంటున్న ప్ర‌దేశంలో మొబైల్ నెట్‌వ‌ర్క్స్‌, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యంపై నిషేధం విధించిన‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు తెలిపాయి. దాడుల భ‌యంతో పుతిన్ బ‌హిరంగ కార్య‌క్ర‌మాలకు కూడా దూరంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కొన్ని నెల‌లుగా రష్యా ఫెడరల్ రక్షణ విభాగం (Russia’s Federal Protective Service) అధ్య‌క్షుడి భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచింది. ఇందులో భాగంగానే పుతిన్ బ‌హిరంగ ప‌ర్య‌ట‌న‌ల‌ను బాగా త‌గ్గించేశారు. అధ్య‌క్షుడిని వ్యక్తిగతంగా కలిసే వ్యక్తుల భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేశారు. అంతేకాదు, ఉక్రెయిన్‌ వైపు నుంచి వచ్చే డ్రోన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు తనిఖీలను మరింత విస్తరించాయి. మాస్కో నది పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాయి.

Also Read..

కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ

దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న రేవంత్ సర్కారు: హ‌రీశ్ రావు

భారీ బ్యాట‌రీ, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. వ‌న్‌ప్ల‌స్ నుంచి నార్డ్ సీఈ6 లైట్ ఫోన్‌..

Advertisement
Advertisement