Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ – తిరుమలలో జాన్వీ కపూర్ సందడి – కాలినడకన శ్రీవారి దర్శనం
పెద్ది రిలీజ్ సందర్భంగా గురువారం హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమలో సందడి చేసింది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. పెద్ది మూవీలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో నటించింది.
Entertainment | Published On Jun 4, 2026, 3.05 pm IST
Janhvi Kapoor | పెద్ది రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమలలో సందడి చేసింది. కాలినడకన శ్రీవారిని దర్శించుకుంది. రామ్‌చరణ్ పెద్ది మూవీలో జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ గురువారం పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజైంది. ఈ సినిమాలో అచ్చియమ్మగా గ్లామర్ రోల్‌లో జాన్వీకపూర్ కనిపించింది. ఈ బాలీవుడ్ హీరోయిన్ స్క్రీన్ ప్రజెన్స్, రామ్‌చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మెట్ల మార్గం ద్వారా...
పెద్ది రిలీజ్ సందర్భంగా గురువారం జాన్వీ కపూర్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చింది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకుంది. శ్రీవారిని దర్శించుకుంది. సీనియర్ హీరోయిన్ మహేశ్వరితో కలిసి జాన్వీ కపూర్ మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండ ఎక్కుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ప్రత్యేక పూజలు...
సుప్రభాత సేవలో పాల్గొన్నది జాన్వీ. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించింది. శ్రీవారి దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో అర్చకులు జాన్వీ కపూర్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమలలోనే పెళ్లి...
జాన్వీ కపూర్‌కు తిరుమలతో విడదీయరాని అనుబంధం ఉంది. తన తల్లి పుట్టినరోజుతో పాటు కొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారి జాన్వీ తిరుమలను దర్శించుకుంటూ వస్తోంది. ఆ సెంటిమెంట్‌ను పెద్ది రిలీజ్ సందర్భంగా కొనసాగించింది. తన పెళ్లి కూడా తిరుపతిలోనే చేసుకుంటానని, ఇక్కడే సెటిలవుతానని పలు సందర్భాల్లో జాన్వీ చెప్పింది. పెద్ది హీరోయిన్‌గా జాన్వీకి తెలుగులో సెకండ్ మూవీ. ఎన్టీఆర్ దేవర మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
[video width="320" height="330" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/06/janhvi.mp4"][/video]
సంబంధిత వార్తలు

Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా – రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
జూన్ 4, 2026

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

Tollywood | మేలో 18 సినిమాలు డిజాస్టర్.. జూన్‌పైనే టాలీవుడ్ ఆశలు..!
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Harish Rao | పోలవరం పూర్తయితే భద్రాచలానికి నిత్యం జలగండమే: హరీశ్‌రావు
- ●Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్
- ●Maruti Suzuki WagonR E85 | పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!
- ●Instagram | మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవొద్దు అంటే.. ఈ సింపుల్ సెట్టింగ్ ను వెంటనే ఆన్ చేయండి..
- ●Mupparam | ప్రైవేట్ బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్.. ముప్పారం గ్రామసభ తీర్మానం
- ●Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Harish Rao | పోలవరం పూర్తయితే భద్రాచలానికి నిత్యం జలగండమే: హరీశ్‌రావు

Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్

Maruti Suzuki WagonR E85 | పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!

Instagram | మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవొద్దు అంటే.. ఈ సింపుల్ సెట్టింగ్ ను వెంటనే ఆన్ చేయండి..



