త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్ర‌యాణాలు చేయొద్దు.. భార‌తీయుల‌కు ఎంబ‌సీ కీల‌క సూచ‌న‌

Indian Embassy in Tehran | అమెరికా-ఇరాన్ మ‌ధ్య డీల్ కుద‌ర‌డంతో మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు చ‌ల్లారాయి. ఈ నేప‌థ్యంలో టెహ్రాన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ (Indian Embassy in Tehran) గ‌తంలో జారీ చేసిన ట్రావెల్ అడ్వైజ‌రీని (travel advisory) స‌వ‌రించింది.

D

National | Published On Jun 24, 2026, 12.19 pm IST

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్ర‌యాణాలు చేయొద్దు.. భార‌తీయుల‌కు ఎంబ‌సీ కీల‌క సూచ‌న‌
Advertisement

Indian Embassy in Tehran | అమెరికా-ఇరాన్ మ‌ధ్య డీల్ కుద‌ర‌డంతో మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు చ‌ల్లారాయి. ఈ నేప‌థ్యంలో టెహ్రాన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ (Indian Embassy in Tehran) గ‌తంలో జారీ చేసిన ట్రావెల్ అడ్వైజ‌రీని (travel advisory) స‌వ‌రించింది. ఇటీవ‌లే చోటు చేసుకున్న సానుకూల ప‌రిణామాలు, మెరుగైన ప‌రిస్థితుల దృష్ట్యా ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌వ‌రించిన‌ట్లు తెలిపింది.

అక్క‌డి భ‌ద్ర‌తా ప‌రిస్థితుల‌ను తాము నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్లు తెలిపింది. ఇరాన్‌లో ప‌రిస్థితులు ప్ర‌స్తుతం మెరుగుప‌డినప్ప‌టికీ.. అక్క‌డి భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. త‌దుప‌రి నోటీసులు వ‌చ్చేంత వ‌ర‌కూ ఇరాన్‌కు అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు పెట్టుకోవద్ద‌ని తెలిపింది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆ దేశానికి రావాల‌నుకునేవారు ఎంబ‌సీ అధికారుల‌ను సంప్ర‌దించి వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సూచించింది. స్థానిక పరిణామాలను నిశితంగా గమనిస్తూ.. ఇరాన్ అధికారులు జారీ చేసే సూచనలను త‌ప్ప‌కుండా పాటించాలని తెలిపింది. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది.

Also Read..

సీఎం కుటుంబం వంద‌ల ఎక‌రాల భూ స్కామ్‌.. సంచ‌ల‌నం రేపుతున్న నివేదిక‌

33 డిగ్రీల ఎండలోనూ హుడీ ధరించి.. కేతన్ హ‌త్య కేసు నిందితులను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

ఈ నెల 30న టెట్ ప్రాథ‌మిక కీ.. ఫ‌లితాలు ఎప్పుడంటే?

Advertisement
Advertisement