TG TET | తెలంగాణ టెట్ ఫలితాలు ఎప్పుండంటే?.. సర్కార్ బడుల్లో ఖాళీగా 14 వేల టీచర్ పోస్టులు!
TG TET | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) రాసిన అభ్యర్థులకు అలర్ట్. ఈ ఏడాది జూన్ సెషన్ టెట్ పరీక్షలు జూన్ 14న ప్రారంభమై 22న (సోమవారం) ముగిశాయి.
TG TET | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) రాసిన అభ్యర్థులకు అలర్ట్. ఫలితాల తేదీపై అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది జూన్ సెషన్ టెట్ పరీక్షలు జూన్ 14న ప్రారంభమై 22న (సోమవారం) ముగిశాయి. పేపర్-1తో పాటు పేపర్-2లోని సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాలకు కలిపి 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,15,028 మంది అంటే 74.81శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. 38,724 మంది గైర్హాజరయ్యారు.
ప్రాథమిక కీ..
టెట్ పరీక్షలు ముగియడంతో అధికారులు ప్రాథమిక కీల విడుదలపై కసరత్తు చేస్తున్నారు. వీటిని జూన్ 30న విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో జూలై 2వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూలై 28 నుంచి 31 తేదీల మధ్య ఫలితాలు విడుదల కానున్నాయి.
సర్కార్ బడుల్లో 14 వేల పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో 14, 171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలోనే ఉండటం గమనార్హం. మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27వేల పాఠశాలలు ఉండగా మొత్తంగా 1,26,820 టీచర్ పోస్టులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 1,13,057 టీచర్లు పనిచేస్తున్నారు. మరో 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు సైతం పెరుగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరుగనుంది. మరోవైపు ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ అని ఊదరగొట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసింది 5 వేలు పోస్టులు మాత్రమే కావడం విశేషం. రాష్ట్రంలో 1.10లక్షల డీఎడ్, 2.40లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. వీరిలో ఇప్పటికే 3 లక్షల మంది టెట్ పాసయ్యారు. వీరంతా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆశ పెట్టుకున్నారు.
తాజావార్తలు
- ●Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు
- ●Bharat Tiwari Encounter | భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమర్శలు.. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు
- ●DIET | డైట్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు.. ఆన్లైన్ అప్లికేషన్లు షురూ..
- ●IIT Roorkee | చికున్‌గున్యాకు గోమూత్రంతో విజయవంతంగా చికిత్స.. వెల్లడించిన ఐఐటీ రూర్కీ..
- ●Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్‌డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
- ●Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్రణాళికలు వెల్లడి..

Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు

Bharat Tiwari Encounter | భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమర్శలు.. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు

DIET | డైట్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు.. ఆన్లైన్ అప్లికేషన్లు షురూ..

IIT Roorkee | చికున్‌గున్యాకు గోమూత్రంతో విజయవంతంగా చికిత్స.. వెల్లడించిన ఐఐటీ రూర్కీ..






