Ponnam Prabhakar | తెలంగాణ కామన్ మ్యాన్స్ లైఫ్ లైన్.. టీజీఎస్ ఆర్టీసీ: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) తెలంగాణ కామన్ మ్యాన్ లైఫ్ లైన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సంస్థ బరువును మోయలేం అనే స్థితి నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్స్‌కు వచ్చే విధంగా ఆర్టీసీకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) తెలంగాణ కామన్ మ్యాన్ లైఫ్ లైన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సంస్థ బరువును మోయలేం అనే స్థితి నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్స్‌కు వచ్చే విధంగా ఆర్టీసీకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. శాసన మండలిలో ఆర్టీసీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో రీయింబర్స్‌మెంట్ నెలనెలా సంస్థకు చెల్లిస్తున్నామన్నారు. రూ.600 కోట్లుగా ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.360 కోట్లకు తీసుకొచ్చామని చెప్పారు. సంస్థలో 3038 పోస్టులను కొత్తగా సృష్టించామని, గత పాలకులు పదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఒక్క కొత్త బస్సు కొనలేదని విమర్శించారు. తాము రెండేండ్లలోనే 2708 బస్సులు కొన్నామన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు కొత్త రూట్లలో కనెక్టివిటీ కల్పిస్తున్నామని తెలిపారు. 600 బస్సులకు మహిళలను యజమానులను చేసి, ఈఎంఐ పోగా మహిళా సంఘాలకు ప్రతి నెల రూ.70 వేలు చెల్లుస్తున్నామని చెప్పారు. 1132 కారుణ్య నియామకాలు చేపట్టామని, రూ.17 కోట్లతో ఆర్టీసీ తార్నాక హాస్పిటల్‌ను ఆధునీకరించామని, ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారికి రూ.కోటి పరిహారం చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
వివిధ కారణాల వల్ల గత పదేండ్లలో ఉద్యోగాల నుంచి తొలగించిన 250 మంది సిబ్బందిని తిరిగి తీసుకున్నామని తెలిపారు. రూ.1355 కోట్ల పీఎఫ్ బకాయిలు ఉంటే వాటిని రూ.650 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు సాధికారత వచ్చిందన్నారు. వారికి అదనంగా సంపాదించుకునే అవకాశం కలింగదని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంపై అక్కసుతో విపక్షాలు ఆటో నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. సిబ్బందికి పనిభారం ఎక్కువైనప్పటికీ ప్రతిరోజూ 60 లక్షల మందిని గమ్యస్థానాలకు చేస్తున్నారని, ఇందుకుగాను ఆర్టీసీ సిబ్బందిని ప్రతిఒక్కరూ అభినందించాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Ponnam Prabhakar | ‘సర్’ పై అప్రమత్తంగా ఉందాం: నియోజకవర్గ ఇంచార్జీలు, పరిశీలకులతో పొన్నం
మే 16, 2026

TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ.. చైర్మన్‌గా కే కేశవరావు
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



