త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flight Tickets | విమానాల్లో 60 శాతం ఉచిత సీట్ల ఉత్తర్వుల‌ను నిలిపివేసిన కేంద్రం

Flight Tickets | విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు ( 60 Percent Free Flight Seats) చేయరాదంటూ గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

D

National | Published On Apr 3, 2026, 11.15 am IST

Flight Tickets | విమానాల్లో 60 శాతం ఉచిత సీట్ల ఉత్తర్వుల‌ను నిలిపివేసిన కేంద్రం
Advertisement

Flight Tickets | విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు ( 60 Percent Free Flight Seats) చేయరాదంటూ గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను (No Selection Fee On 60 Percent Seats) ఉచితంగా అందుబాటులో ఉంచాలని మార్చి 17న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఆకాశ ఎయిర్ స‌హా ప‌లు విమాన‌యాన సంస్థ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి.

ఈ నిబంధ‌న‌ల వ‌ల్ల విమాన కార్య‌క‌లాపాలు, వాణిజ్య‌ప‌ర‌మైన అంశాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలిపాయి. ముఖ్యంగా టికెట్ ధ‌ర‌ల నిర్మాణంలో మార్పులు వ‌స్తాయ‌ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేప‌థ్యంలోనే విమాన‌యాన సంస్థ‌ల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి రావాల్సిన 60 శాతం ఉచిత సీట్ల ఉత్తర్వును ప్ర‌స్తుతానికి హోల్డ్‌లో ఉంచింది. కాగా, కొత్త ఉత్త‌ర్వుల‌కు ముందు విమానాల్లో కేవ‌లం 20 శాతం సీట్లు మాత్ర‌మే ఉచితంగా బుక్ చేసుకునే అవ‌కాశం ఉండేది. మిగిలిన సీట్ల ఎంపిక కోసం ప్రయాణికులు వాటి స్థానం, లెగ్ రూమ్ ఆధారంగా రూ.200 నుంచి రూ.2,100 వరకూ చెల్లించాల్సి వచ్చేది.

Also Read..

మౌన‌మే.. కానీ, ఓట‌మి కాదు.. ఆప్‌ను ఉద్దేశించి రాఘ‌వ్ చ‌ద్ధా ఆస‌క్తిక‌ర వీడియో

క్యూలైన్‌లో 600 ఖాళీ సిండ‌ర్లు.. కోహిర్‌లో గ్యాస్ బండ కోసం క‌ష్టాలు

అభిషేక్ శ‌ర్మ‌కు ఐపీఎల్ గవ‌ర్నింగ్ కౌన్సిల్ షాక్‌.. 25 శాతం ఫైన్‌, 1 డీమెరిట్ పాయింట్‌..

Advertisement
Advertisement