Skyscanner In ChatGPT | తక్కువ టిక్కెట్ ధరతోనే విమానంలో వెళ్లాలా.. అయితే చాట్ జీపీటీని ఇలా అడగండి..
Skyscanner In ChatGPT | కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లాట్‌ఫామ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ప్రజలకు కావల్సిన సదుపాయాలు కూడా చాలా త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే గతంలో చాలా ఎక్కువ సమయం తీసుకునే పనులను ఇప్పుడు వేగంగా పూర్తి చేసుకుంటున్నారు కూడా.
Technology | Published On Apr 24, 2026, 5.36 pm IST
Skyscanner In ChatGPT | కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లాట్‌ఫామ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ప్రజలకు కావల్సిన సదుపాయాలు కూడా చాలా త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే గతంలో చాలా ఎక్కువ సమయం తీసుకునే పనులను ఇప్పుడు వేగంగా పూర్తి చేసుకుంటున్నారు కూడా. అనేక రంగాల్లో ఏఐ సంచలనాలను సృష్టిస్తోంది. దీంతో ప్రజల జీవన విధానం సులభతరం అవడమే కాక మరింత మెరుగు పడుతోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ సేవలను అందిస్తుండగా అనేక మంది వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఇక విమానయాన రంగంలోనూ ఏఐ సేవలను అందిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ స్కై స్కానర్ (Skyscanner) తమ సేవలను చాట్ జీపీటీకి విస్తరించినట్లు తెలియజేసింది. ఇక యూజర్లు చాట్ జీపీటీలో నేరుగా స్కై స్కానర్ ఉపయోగించి తమ ప్రయాణ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే విమాన టిక్కెట్లను బుక్ చేయడం, ధరలు ఏ సర్వీసుల్లో తక్కువగా ఉన్నాయి, ఇతర ప్రయాణ వివరాలను చాట్ జీపీటీ ద్వారానే అందిస్తున్నారు.
చిన్న కమాండ్లతో పూర్తి వివరాలు..
స్కై స్కానర్ సంస్థ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్ జీపీటీలో తమ సేవలను ప్రారంభించింది. ఈ అనుసంధానం ద్వారా భారత్‌లోని ఎంతో మంది విమాన ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం, సౌకర్యవంతం అవుతుందని స్కై స్కానర్ తెలిపింది. వినియోగదారులు తమకు కావల్సిన సహజ భాషలోనే చాట్ జీపీటీలో విమానాలు, ప్రయాణ వివరాలను, ధరలను సులభంగా తెలుసుకోవచ్చు. నచ్చిన ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే వినియోగదారులు చాట్ జీపీటీ యాప్‌లో పలు కమాండ్లను ఇవ్వాల్సి ఉంటుంది. @skyscanner అనే ప్రీ ఫిక్స్ పదాన్ని ఉపయోగించి స్కై స్కానర్ సేవలను చాట్ జీపీటీలో పొందవచ్చు. వినియోగదారుల ట్రిప్ ప్లానింగ్‌ను వీలైనంత సహజ సంభాషణతో నిర్వహించేందుకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు స్కై స్కానర్ తెలియజేసింది. @skyscanner find me the cheapest flight to Japan in August అని చాట్ జీపీటీలో సెర్చ్ చేయడం ద్వారా వినియోగదారులు అత్యుత్తమ విమాన సర్వీసులను తక్కువ ధరల్లో ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ప్రయాణ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
ఎన్నో ఆప్షన్‌లను వెదకవచ్చు..
యూజర్ కమాండ్లను ఇవ్వగానే చాట్ జీపీటీ సిస్టమ్ స్కై స్కానర్ డేటాబేస్‌లోని వివరాలను వెదికి యూజర్‌కు తెరపై డిస్‌ప్లే చేస్తుంది. చాట్ ఇంటర్ ఫేస్‌లో విజువల్‌గా వివరాలను తెలుసుకోవచ్చు. మొదటి ఫలితాలు వచ్చిన తరువాత యూజర్లు అదే చాట్‌లో మరిన్ని ప్రశ్నలు అడగవచ్చు. విమాన టిక్కెట్ల ధరలను పోల్చుకోవచ్చు, ప్రయాణ తేదీలు, ఎయిర్ పోర్ట్‌లను మార్చి మరిన్ని ఆప్షన్‌లను వెదకవచ్చు. నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా స్కై స్కానర్ ప్లాట్‌ఫామ్‌ను నెలకు సుమారుగా 160 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తుండగా, వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈవెంట్ ప్రధానంగా కూడా సర్వీసులను వెదకవచ్చు..
అయితే ఈ టూల్ ద్వారా మరిన్ని ప్రత్యేకమైన సర్వీసులను యూజర్లు వెదకవచ్చు. ఎలా అంటే ఏదైనా ఈవెంట్ ఒక సిటీలో జరుగుతుంటే ఆ సిటీకి చెందిన విమానాల వివరాలను ఆ ఈవెంట్‌తో వెతకవచ్చు. అంటే ఉదాహరణకు ఢిల్లీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఆ మ్యాచ్‌ను చూసేవారు లేదా అదే రోజు ఢిల్లీ వెళ్లే వారు ఆ మ్యాచ్ టైముకు స్టేడియం వద్ద ఉండేలా ఇతర సిటీల నుంచి విమానాలను వెదకవచ్చు. దీంతో ఈవెంట్‌కు సరైన టైముకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని కూడా స్కై స్కానర్ తన కొత్త ఫీచర్‌లో భాగంగా అందిస్తోంది. ఇక తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ మార్గాలను సూచించడం, డైనిమిక్ ఫేర్ ట్రాకింగ్.. అంటే రియల్‌టైమ్‌లో తక్కువ ఖర్చుతో ఏయే విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి వంటి వివరాలను కూడా ఈ టూల్ ద్వారా వెదకవచ్చు. ఇక ఈ టూల్ చాట్ జీపీటీ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంది కనుక యూజర్లు యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. వెబ్ వెర్షన్‌లో అయితే నేరుగా ఉపయోగించుకోవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






