త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఒకే రూట్‌కు ధ‌ర‌ల్లో తేడాలెందుకు? విమానాల చార్జీల‌పై సుప్రీం సీరియ‌స్‌..!

P

National | Published On May 15, 2026, 5.36 pm IST

Supreme Court | ఒకే రూట్‌కు ధ‌ర‌ల్లో తేడాలెందుకు? విమానాల చార్జీల‌పై సుప్రీం సీరియ‌స్‌..!
Advertisement

Supreme Court | విమాన టికెట్ ధరల్లో భారీ వ్య‌త్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే రోజు, ఒకే మార్గంలో ప్రయాణానికి వేర్వేరు ఎయిర్‌లైన్స్ భిన్నంగా భారీగా చార్జీలు వ‌సూలు చేస్తున్నాయ‌ని, ప్రయాణికులపై భారం తగ్గించే మార్గాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జ‌స్టిస్ విక్ర‌మ్‌నాథ్‌, సందీప్ మెహ‌తా ధ‌ర్మాస‌నం శుక్ర‌వారం ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టింది. “ఒక విమాన సంస్థ ఎకానమీ టికెట్‌ను రూ.8 వేలకే ఇస్తుంటే.. మరో సంస్థ అదే మార్గంలో ప్ర‌యాణానికి రూ.18వేల వ‌ర‌కు ఎందుకు వ‌సూలు చేస్తోంది? ఇందులో స‌మతుల్య‌త అవ‌స‌రం కాదా? అంటూ కోర్టు ప్ర‌శ్నించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరాలు అందించారు.

2024లో అమల్లోకి వచ్చిన కొత్త విమానయాన చట్టానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్నాయని, ప్రభుత్వం స‌మ‌స్య‌ను తీవ్రంగా ప‌రిశీలిస్తోంద‌న్నారు. ఈ అంశాన్ని వివాదాస్ప‌దం కాకుండా ప్ర‌జాప్ర‌యోజ‌న కోణంలో ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ పిటిష‌న్‌ను సామాజిక కార్య‌క‌ర్త ఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ‌న్ ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. విమాన టికెట్ ధరల్లో పారదర్శకత తేవాల‌ని, చార్జీలు ఆక‌స్మికంగా పెంచ‌డం, అద‌న‌పు చార్జీల‌ను నియంత్రించేందుకు స్వ‌తంత్ర సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పిటిష‌న‌ర్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ర‌వీంద్ర శ్రీ‌వాస్త‌వ వాద‌న‌లు వినిపించారు.

1937 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలో ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయ‌ని, వాటినే స‌రిగా అమ‌లు చేయ‌డం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. చార్జీలు భారీగా పెరిగిన స‌యంలో జోక్యం చేసుకునే అధికారం డీజీసీఏకు ఉంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. కేంద్రం ‘భారతీయ వాయుయాన్ అధినియం-2024’ కింద కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై పిటిషనర్ స్పందన ఇవ్వాలని ఆదేశించిన ధ‌ర్మాస‌నం.. విచార‌ణ‌ను జులై 13కి వాయిదా వేసింది. గ‌తంలోనూ పండ‌గ‌ల స‌మ‌యంలో టికెట్ల ధ‌ర‌ల‌ను అమాంతం పెంచ‌డాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement