IIT Bombay | విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్
IIT Bombay | ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay)లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సాహిల్ అనే విద్యార్థి మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల (Professor Suryanarayana Doolla)ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
IIT Bombay | త్రినేత్ర.న్యూస్ : ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay)లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాహిల్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు. సాహిల్ ఆత్మహత్యకు వేధింపులే కారణమని, క్యాంపస్‌లో కులవివక్ష ఎదుర్కొన్నాడని విద్యార్థులు, మృతుడి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల (Professor Suryanarayana Doolla)ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐఐటీ బాంబే యాజమాన్యం ముందు 18 డిమాండ్లు ఉంచారు. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించడం, క్యాంపస్‌లో జరిగిన ఆత్మహత్యలపై నిష్పక్షపాత విచారణ జరిపించడం, ప్రొఫెసర్ల మానసిక ఆరోగ్యంపై వర్క్‌షాప్‌లు నిర్వహించడం వంటి డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. ఈ డిమాండ్లపై నిరసనకారులతో ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదారే ఆదివారం రాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపి అనంతరం డిమాండ్లకు అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ చార్టర్‌లోని ప్రధాన డిమాండ్లలో ప్రొఫెసర్ దూళ్లపై చర్యలు తీసుకోవడం కూడా ఒకటి కావడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మరోవైపు ప్రొఫెసర్ దూళ్లకు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం మద్దతుగా నిలిచింది. ఆయన నిబంధనల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేసింది. పరీక్ష సమయంలో సాహిల్ అనధికారికంగా మొబైల్ ఫోన్ వాడుతూ అడ్డంగా దొరికిపోయినందుకే చర్యలు తీసుకున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రొఫెసర్‌పై నిబంధనల ప్రకారమే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది.
వివాదానికి కారణమేంటి..?
పవాయిలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ అనే 19 ఏళ్ల విద్యార్థి.. ఇటీవలే జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీలో (ChatGPT) అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల ఈ విషయాన్ని అకడమిక్ డిసిప్లినరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే, ఇన్‌స్టిట్యూట్ అధికారులు సదరు విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలూ తీసుకోలేదు. డిపార్ట్‌మెంట్ హెడ్ సాహిల్‌ను పిలిచి కేవలం కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఈ ఘటన తన అకడమిక్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపదని భరోసా ఇచ్చారు. అంతేకాదు, మళ్లీ ఇలాంటి ఘటనకు పాల్పడొద్దని చెప్పి పంపించేశారు.
సాహిల్ ఆత్మహత్య..
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన సాహిల్ శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడటమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా భావించినప్పటికీ.. సాహిల్ తండ్రి రవీంద్ర వకోడ్ ఇచ్చిన ఫిర్యాదుతో అసలు వివాదం మొదలైంది. తన కుమారుడు షెడ్యూల్డ్ కులానికి (ఎస్సీ) చెందినవాడని, గత మూడు నెలలుగా ప్రొఫెసర్ దూళ్ల అతడిని కులం పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పవాయి పోలీసులు ప్రొఫెసర్ దూళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎంతకీ ఎవరీ ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల..?
ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల.. ఐఐటీ బాంబే ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్. పవర్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్లు, మైక్రోగ్రిడ్లు, పునరుత్పాదక ఇంధన సమన్వయంలో ఆయన ప్రత్యేక నిపుణుడు. ఆయన 2000లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2002లో ఐఐటీ బాంబే నుంచి ఎనర్జీ సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2007లో ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) నుంచి పవర్ సిస్టమ్స్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో చేరడానికి ముందు ఏలూరులోని సర్ సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ , కాకినాడ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా అధ్యాపకుడిగా పని చేశారు. అంతేకాకుండా బెంగళూరులోని పవర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్స్, హైదరాబాద్‌లోని మెషిన్ 2 మెషిన్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.
Also Read..
సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. బుధవారం అత్యవసర విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IIT Bombay Student | పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య
సెప్టెంబర్ 19, 2026

OpenAI | ఆర్థిక సేవలను అందించనున్న చాట్ జీపీటీ.. ఓపెన్ఏఐ కొత్త ఫీచర్..
సెప్టెంబర్ 12, 2026

AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Danam Nagender Supreme Court | సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. బుధవారం అత్యవసర విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్
- ●KTR | జూరాల ఆయకట్టు రైతుల అరెస్టు అత్యంత దుర్మార్గం
- ●itel A300C | రూ.10,999కే ఐటెల్ ఎ300సి ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
- ●Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు

Danam Nagender Supreme Court | సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. బుధవారం అత్యవసర విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్

KTR | జూరాల ఆయకట్టు రైతుల అరెస్టు అత్యంత దుర్మార్గం

itel A300C | రూ.10,999కే ఐటెల్ ఎ300సి ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ..

Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?



