త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన‌ 9 ఏండ్ల బాలిక‌.. ద‌వాఖాన‌కు త‌ర‌లించేలోగా..

Class 3 Student | ఆడుతూ పాడుతూ బ‌డికి వెళ్లిన తొమ్మిదేండ్ల చిన్నారి.. త‌ర‌గ‌తిలోనే (Class 3 Student) ఒక్క‌సారిగా కుప్ప‌కూలి పోయింది. ద‌వాఖాన‌కు త‌ర‌లించేలోపే ప్రాణాలు వ‌దిలింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని మ‌యూర్ విహార్‌లో (Mayur Vihar) చోట‌చేసుకుంది.

G

National | Published On Nov 25, 2026, 2.10 pm IST

Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన‌ 9 ఏండ్ల బాలిక‌.. ద‌వాఖాన‌కు త‌ర‌లించేలోగా..
Advertisement

Class 3 Student | త్రినేత్ర న్యూస్‌: ఆడుతూ పాడుతూ బ‌డికి వెళ్లిన తొమ్మిదేండ్ల చిన్నారి.. త‌ర‌గ‌తిలోనే (Class 3 Student) ఒక్క‌సారిగా కుప్ప‌కూలి పోయింది. ద‌వాఖాన‌కు త‌ర‌లించేలోపే ప్రాణాలు వ‌దిలింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని మ‌యూర్ విహార్‌లో (Mayur Vihar) చోట‌చేసుకుంది.

ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన తొమ్మిదేండ్ల బాలిక మ‌యూర్ విహార్‌లోని ఓ పాఠ‌శాల‌లో (Delhi School) మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది. రోజూలానే బుధ‌వారం ఉద‌యం కూడా హుషారుగా స్కూల్‌కి వ‌చ్చింది. ఉద‌యం 9.10 గంట‌ల‌కు పీటీ పీరియ‌డ్ ముగిసిన త‌ర్వాత తోటి విద్యార్థుల‌తో క‌లిసి క్లాస్ రూమ్‌కి వెళ్లింది. నడుముపై చేతులు పెట్టుకుని నిలబడిన కొద్దిసేపటికే ఒక్కసారిగా ముందుకు కుప్పకూలి (Collapse) పడిపోయింది. అప్రమత్తమైన ఉపాధ్యాయురాలు ఆమెను పైకి లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. స్పందించ‌క‌పోవ‌డంతో పాఠశాల సిబ్బంది ఆమెను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆ చిన్నారి మృతిచెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌వాఖాన‌కు చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎల్‌బీఎస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్రాథమిక దర్యాప్తులో చిన్నారి గుండెపోటుతో (Heart Attack) మరణించిన‌ట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం తెలుస్తుందని వెల్ల‌డించారు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Advertisement
Advertisement