త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | జిల్ల‌పురుగులిచ్చిన జ‌వాబ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్‌’.. వారికి హ్యాట్స‌ఫ్‌

Talasani Srinivas Yadav | దేశ‌ద్రోహులంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి విద్యార్థులు ఇచ్చిన సమాధానం ‘ఇంక్విలాబ్ జిందాబాద్‌’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కొనియాడారు. స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేసినా, దమనకాండకు పాల్పడినా కేంద్రం దిగి రాక తప్పలేదన్నారు.

S

Telangana | Published On Jul 25, 2026, 5.15 pm IST

Talasani Srinivas Yadav | జిల్ల‌పురుగులిచ్చిన జ‌వాబ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్‌’.. వారికి హ్యాట్స‌ఫ్‌
Advertisement
  • ఏం చేసినా కేంద్రం దిగిరాక త‌ప్ప‌లే
  • తరం మారుతోంది.. అందరి వైపు చూస్తోంది
  • ప్ర‌భుత్వాలు ఆలోచించి హామీలియ్యాలే
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌ద్రోహులంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి విద్యార్థులు ఇచ్చిన సమాధానం ‘ఇంక్విలాబ్ జిందాబాద్‌’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కొనియాడారు. స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేసినా, దమనకాండకు పాల్పడినా కేంద్రం దిగి రాక తప్పలేదన్నారు. దాని ప‌ర్యావ‌సాన‌మే కేంద్ర‌ మంత్రి ప్ర‌ధాన్ రాజీనామా అని పేర్కొన్నారు. దీన్ని ప్రభుత్వాలు గుణపాఠంలా తీసుకోవాలని సూచించారు. శ‌నివారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ త‌ర‌ఫున విద్యార్థుల‌కు హ్యాట్స‌ఫ్ తెలియ‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇది ప్ర‌జాస్వామ్య విజ‌యం..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం. విద్యార్థులు, యువత కాక్రోచ్‌ల గెలుపు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోంది. విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తరం మారుతోంది.. ఇక అందరి వైపు చూస్తుంది. విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉందని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలం నిన్న సంఘీభావం ప్రకటించాం అని త‌ల‌సాని తెలిపారు.

విద్యార్థుల దెబ్బ‌కు పార్ల‌మెంటు గేట్లే మూసేశారు..

మేనిఫెస్టోలు ప్రకటించే సమయంలో, హామీలు ఇచ్చేటపుడు పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థుల దెబ్బకు పార్లమెంట్ గేట్లు మూయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆలోచించండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి విద్యార్థులు ఇచ్చిన సమాధానం ఇంక్విలాబ్ జిందాబాద్.. భారత్ మాతా కీ జై అంటూ త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ నిన‌దించారు.

ఈ మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్ర శేఖర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement