BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల బెల్జియం శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను తెలంగాణ ప్రవాసులు, పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల బెల్జియం శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను తెలంగాణ ప్రవాసులు, పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పనలో కేటీఆర్ నాయకత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, బీఆర్ఎస్ సిద్ధాంతాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బెల్జియం శాఖను మరింత బలోపేతం చేసేందుకు జగన్నాథ్ ప్రసాద్ రామానుజం నాయకత్వంలో తాత్కాలిక అడహాక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మహేష్ బిగాల తెలిపారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన అనంతరం పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. బెల్జియంలోని తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేలా కొత్త కమిటీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలు, తెలంగాణ ఆత్మగౌరవ భావనను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో విదేశీ శాఖలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రవీణ్ జారుగుమల్లికి, బెల్జియం శాఖ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శ్యామ్ అకులకు మహేశ్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బెల్జియంలోని తెలంగాణ ప్రవాసులు, బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాంత్, మనోజ్, మంజునాథ్, విజయ్, రాజశేఖర్, ఫణి, హరీష్, నాగరాజు జగిని, అఖిల్ రెడ్డి, భాను, చన్నా రెడ్డి, రమణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
- ●OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క
- ●99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్
- ●Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా
- ●Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య - విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క

99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్




