IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..
IND Vs ZIM | జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా 2-0తో అజేయ ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది.
IND Vs ZIM | జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా 2-0తో అజేయ ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు.
ఇద్దరూ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం ఇషాన్, తిలక్ వర్మ నాలుగో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 25, వైభవ్ సూర్యవంశీ 20, రింకూ సింగ్ 12 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. బ్రియాన్ బెన్నెట్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, తాదివనాషే మరుమణి 24, ర్యాన్ బర్ల్ 20, బ్రాడ్ ఎవాన్స్ 19 పరుగులు చేశారు.
భారత్ బౌలర్లలో అభిషేక్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్ ఆడిన యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ తొలి టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. టీ20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయిన శ్రేయస్‌కు జింబాబ్వే పర్యటన ఊరటనిచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో టీ20 క్రికెట్‌లో భారత్ మరో అరుదైన రికార్డును సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఏడాదిలో తొమ్మిదోసారి 200కుపైగా స్కోరు నమోదు చేసి, 2024లో నెలకొల్పిన రికార్డును సమం చేయడం విశేషం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- ●BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- ●Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
- ●OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క

Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు



