త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Komatireddy | నల్లగొండ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శ‌నివారం ప్రారంభించారు.

P

Telangana | Published On Jul 25, 2026, 9.05 pm IST

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
Advertisement

Komatireddy | నల్లగొండ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శ‌నివారం ప్రారంభించారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు ఈ మార్గంలో ప్రతిరోజూ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గిపోనున్నాయి. రద్దీగా ఉండే మర్రిగూడ జంక్షన్‌లో ప్రమాదాల నివారణకు, ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చేందుకు ఈ వంతెన ఉపయోగపడనుంది.

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని అధికారులు తెలిపారు. మెరుగైన రవాణా వ్యవస్థతో నల్లగొండ ప్రాంతంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుందని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమస్యకు పరిష్కారం లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ స‌ర్కారు కట్టుబడి ఉందని మంత్రి వెంక‌ట్‌రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement