IBM | హెచ్-1బీ వీసాదారులకు షాకిచ్చిన IBM.. ఇక ఉద్యోగులకు రెండే ఆప్షన్లు
IBM | ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) ఉద్యోగులకు షాకిచ్చింది. అమెరికా వర్క్ వీసాలు (H-1B visa), గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను (green card sponsorship) నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభావితమైన ఉద్యోగుల ముందు టెక్ దిగ్గజం రెండు ఆప్షన్లు ఉంచింది.
త్రినేత్ర న్యూస్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు షాకిచ్చింది. తమ కన్సల్టింగ్ విభాగంలోని (IBM Consulting) మెజారిటీ ఉద్యోగాలకు అమెరికా వర్క్ వీసాలు (H-1B visa), గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను (green card sponsorship) నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభావితమైన ఉద్యోగుల ముందు టెక్ దిగ్గజం రెండు ఆప్షన్లు ఉంచింది.
అమెరికా వెలుపల వేరే దేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు మారాలని లేదా ఉద్యోగాన్ని వదులుకోవాలని తేల్చి చెప్పింది. విదేశాలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు కేవలం 3 వారాల సమయం మాత్రమే ఇచ్చింది. బదిలీకి ఇష్టపడని ఉద్యోగులకు 3 నెలల వేతనం (Severance Pay) ఇచ్చి సంస్థ నుంచి సాగనంపున్నట్లు తెలుస్తోంది. వీరికి డిసెంబర్ 31, 2026 చివరి పని దినంగా నిర్ణయించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, స్థానికంగానే నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు IBM ప్రతినిధి తెలిపారు. 2024 నుండి కన్సల్టింగ్ విభాగం వృద్ధి మందగించడం, కంపెనీ పూర్తిగా సాఫ్ట్‌వేర్ రంగానికే ప్రాధాన్యత ఇస్తుండటం మరో కారణంగా పేర్కొన్నారు.
భారత్ ప్రధాన గమ్యస్థానం
అమెరికా వీడాల్సి వస్తే ఉద్యోగులకు భారత్ ప్రధాన గమ్యస్థానంగా మారనుంది. నవంబర్ 19 నాటికి IBM పోర్టల్‌లో అమెరికా వెలుపల 1,278 కన్సల్టింగ్ ఖాళీలు ఉండగా.. అందులో 1,125 ఉద్యోగాలు ఒక్క భారత్‌లోనే ఉండటం విశేషం. దీంతో చాలా మంది భారత్‌వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. అయితే, ఇక్కడే అసలు సమస్య ఉద్యోగులను కలవరపెడుతోంది. భారత్‌కు మారితే జీతభత్యాల్లో భారీ కోత (సుమారు 80% వరకు తగ్గే అవకాశం) విధించే అవకాశం ఉంది. దీంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా కఠిన వీసా నిబంధనల ఎఫెక్ట్
అమెరికాలో ట్రంప్ యంత్రాంగం (Trump administration) విదేశీ నియామకాలు, వర్క్ వీసా నిబంధనలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 1,00,000 డాలర్ల భారీ ఫీజు విధించడం, ఎక్కువ వేతనం ఉన్న వారికే లాటరీలో ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు మార్చడం కంపెనీలకు భారంగా మారింది. ఇటీవలే మైక్రోసాఫ్ట్, అడోబ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌పై కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఐబీఎం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు కేవలం కంపెనీ వీసాలపైనే ఆధారపడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి ఆధునిక టెక్నాలజీల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read..
ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IBM | టెకీలకు ఐబీఎం షాక్.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేసిన టెక్ దిగ్గజం
నవంబర్ 11, 2026

Heart Attack| పిల్లలతో ఆడుకుంటుండగా గుండెపోటు.. కుర్చీలోనే కుప్పకూలిన టెకీ
సెప్టెంబర్ 15, 2026

America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?
జులై 11, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
- ●TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
- ●Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
- ●Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?
- ●Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..
- ●Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?



