త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | ఏమిటా భ‌క్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీ‌వారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

TTD | తిరుమ‌ల తిరుప‌తి (Tirumala Thirupathi) వేంక‌టేశ్వ‌ర స్వామికి భ‌క్తులు న‌గదు, ఆభ‌ర‌ణాల రూపాల్లో కానుక‌లుగా చెల్లించ‌డం ప‌రిపాటే. ల‌క్ష‌లు, కోట్ల‌లో న‌గ‌దు, కిలోల్లో బంగారు ఆభ‌ర‌ణాలిచ్చిన‌వారూ ఉన్నారు. కానీ తాజాగా చెన్నైకి చెందిన ఓ భ‌క్తులు ఏకంగా 121 కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌(Gold Ornaments)ను కానుక‌గా ఇచ్చి చ‌రిత్ర సృష్టించారు.

S

National | Published On Nov 26, 2026, 5.12 pm IST

TTD | ఏమిటా భ‌క్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీ‌వారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
Advertisement

TTD | త్రినేత్ర న్యూస్: తిరుమ‌ల తిరుప‌తి (Tirumala Thirupathi) వేంక‌టేశ్వ‌ర స్వామికి భ‌క్తులు న‌గదు, ఆభ‌ర‌ణాల రూపాల్లో కానుక‌లుగా చెల్లించ‌డం ప‌రిపాటే. ల‌క్ష‌లు, కోట్ల‌లో న‌గ‌దు, కిలోల్లో బంగారు ఆభ‌ర‌ణాలిచ్చిన‌వారూ ఉన్నారు. కానీ తాజాగా చెన్నైకి చెందిన ఓ భ‌క్తులు ఏకంగా 121 కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌(Gold Ornaments)ను కానుక‌గా ఇచ్చి చ‌రిత్ర సృష్టించారు. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇప్పుడిదే అతి పెద్ద బంగారు కానుకైంది. కనీవినీ ఎరుగని భక్తి విశేషమైంది. అసలు ఈ వ‌ర్ధ‌మాన్ జైన్ (Vardhaman Jain) ఎవ‌రు? అంత మొత్తంలో బంగారం ఎందుకిచ్చారో మ‌న‌మూ తెలుసుకుందాం ప‌దండి.

అందుకే ఇచ్చారు..

వర్ధమాన్ జైన్ చెన్నైకి చెందిన 'యాక్సెస్ హెల్త్‌కేర్ (Access Healthcare)' సంస్థ వ్యవస్థాపకులు, వైస్ చైర్మన్. ఇటీవల తన కంపెనీలోని మెజారిటీ వాటాను విక్రయించడం ద్వారా ఆయనకు రూ.6,000 కోట్లకు పైగా ఆదాయం ల‌భించింది. వ్యాపారంలో ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ఆ ఏడుకొండల స్వామివారికి త‌న‌ చిరకాల మొక్కును తీర్చేసుకున్నారు. ఇందు కోసం ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించారు.

ఆభరణాల త‌యారీకి ఎన్ని నెల‌లు ప‌ట్టిందంటే?

స్వామివారిని శిరస్సు నుండి పాదాల వరకు అలంకరించేలా 9 సెట్లలో, దాదాపు 45 రకాల ఆభరణాలను 15 నెలల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో తయారు చేయించారు. ఇందులో శ్రీవారి కిరీటం, పాదుకలు, శంఖు-చక్రాలు, కటి-వరద హస్తాలు, వడ్డాణం, బహుళ వరుసల హారాలు ఉన్నాయి. గర్భగుడిలోని మూలవిరాట్టును నిలువునా అలంకరించడానికి సరిగ్గా 121 కిలోల బంగారం అవసరమవుతుంది. ఆలయంలో ఇప్పటికే ఉన్న మూడు సెట్లకు తోడుగా, ఇది స్వామివారికి నాలుగో పూర్తి స్థాయి ఆభరణాల సెట్‌గా నిలిచిపోనుంది.

ఏమేం చేయించారంటే..

శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చెన్నైకి చెందిన దాతలు వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు 46 రకాల ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు.

1. పాద కవచములు - 2
2. అందెలు - 2
3. పాగడా - 1
4. తులసిపత్ర హారము - 1
5. అష్టోత్తర శత కాసుల మాల - 1
6. చతుర్భుజ లక్ష్మీ హారము - 1
7. పులిగోరు - 1
8. అశ్వత్థ పత్ర హారము - 1
9. సాదా వడ్డాణము - 1
10. గంటల మొలత్రాడు- 1
11. సూర్య కఠారి – 1
12. కౌస్తుభం - 1
13. శ్రీవత్సం - 1
14. మోచేయి - 1
15. కటి హస్తము పై రేకు- 1
16. నాగాభరణ వడ్డాణము - 1
17. గోపు - 1
18. ఐదు పేటల కంఠెలు - 5
19. చంద్రవంకీ కంఠి - 1
20. వైకుంఠ హస్తము - 1
21. కటి హస్తము - 1
22. నాగాభరణ కడియములు - 2
23. నాగాభరణములు - 2
24. భుజకీర్తులు - 2
25. కర్ణ పత్రములు - 2
26. బావులీలు- 2
27. శాలిగ్రామ హారము - 2 (2 Parts)
28. కమలం తరహా శాలిగ్రామ హారములు - 2 (2 Parts)
29. శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం - 1
30. శంఖము కవచము - 1
31. చక్రము కవచము - 1
32. ముఖపట్టి -1
33. కిరీటము -1

గతంలోనూ కానుక‌లు..

2019 నుంచి స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటున్న జైన్, గతంలో తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు, ఎస్వీబీసీ (SVBC) ఛానల్‌కు రూ.7 కోట్లు, గోశాలలో పశుగ్రాసం ప్లాంట్ కోసం రూ.5 కోట్లు, హుండీ నాణేలను లెక్కించే యంత్రం కోసం రూ. కోటి విరాళంగా స‌మ‌ర్పించారు.

Advertisement
Advertisement