CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
CM Revanth Reddy | డిండి నుంచి మునుగోడు, దేవరకొండ, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 0.6 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించి కృష్ణా నీళ్లు పారిస్తామని సీఎం తేల్చిచెప్పారు.
బ్రిటీష్ దొరలను, నిజాం నవాబును ఎదుర్కొన్న జాతి లంబాడా జాతి
ఎస్టీ రిజర్వేషన్లు కల్పించిందే ఇందిరా గాంధీ
దాంతోనే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
4 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లు అందించాం
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీఎం రేవంత్ భూమిపూజ
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : డిండి నుంచి మునుగోడు, దేవరకొండ, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 0.6 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించి కృష్ణా నీళ్లు పారిస్తామని సీఎం తేల్చిచెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం, విగ్రహానికి శంకుస్థాపన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
350 ఏండ్ల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక గొప్ప సన్మార్గాన్ని, శాంతితో బతకాలని, మద్యానికి దూరంగా ఉండాలని, పేదలకు సేవ అందించాలనే సంకల్పంతో గొప్ప ఆదర్శమూర్తిగా నిలబడ్డాడు. లంబాడా సోదరులందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవం అని పేర్కొన్నారు.
నమ్మితే సొమ్ము అయ్యే జాతి లంబడా జాతి
గత ప్రభుత్వాలు లంబాడా సోదరులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. లంబాడాలకు విద్య, ఉద్యోగ, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పించారు. మీ జాతి బ్రిటీష్ దొరలను గడగడలాడించిన జాతి. నిజాం నవాబును ఎదుర్కొన్న జాతి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భీంరెడ్డి నర్సింహారెడ్డిని నిజాం రజాకార్లు వేటాడుతుంటే మీరు ఆశ్రయించి కాపాడిన జాతి. నమ్మితే సొమ్ము అయ్యే జాతి లంబడా జాతి. అందుకే మీ ఆత్మగౌరవం నిలబెట్టాలని, ఆర్థిక, విద్య వెనుకబాటును చూసి జైపాల్ రెడ్డి ఇందిరా గాంధీ దృష్టికి తీసుకెళ్లి 1976లో బలహీన వర్గాల్లో ఉన్న మిమ్మల్ని ట్రైబల్స్‌లోకి మార్పించి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించారు. దాంతో డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాణించారు అని సీఎం గుర్తు చేశారు.
లక్షలాది గిరిజనులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చారు
వలసపోతున్న లక్షలాది గిరిజనులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. మీరు దున్నుకున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. 12 లక్షల ఎకరాలు పంచి పెట్టారు ఇందిరా గాంధీ. ఏ తండాకు వెళ్లిన ఆ ఇంట్లో ఇందిరమ్మ బొమ్మ, సంత్ సేవాలాల్ బొమ్మ కనిపిస్తుంది. చాలా మంది ఆ తరంలో మీ పిల్లలకు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నారు.. ఈ తరంలో ప్రియాంక పేరు పెట్టుకున్నారు.. కృతజ్ఞతను తెలియజేస్తున్నారు అని సీఎం పేర్కొన్నారు.
ఎస్టీ కమిషన్‌కు లంబాడా సోదరుడిని నియమిస్తాం..
రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో ఎస్సీ, ఎస్టీలకు 4 లక్షల వరకు అందించడం జరిగింది. ప్రతి పథకాన్ని గిరిజనులకు వర్తింపజేస్తున్నాం. అచ్చంపేట ప్రాంతానికి రూ. 450 కోట్ల అభివృద్ధి పనులు తీసుకువచ్చాం. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని 16 ఎకరాల్లో నిర్మించుకుంటున్నాం. ఇంకో నాలుగు ఎకరాల భూమిని సేకరిస్తే దేశానికే గొప్ప ఆలయాన్ని నిర్మించి ఇద్దాం. ఎస్టీ కమిషన్‌కు లంబాడా సోదరుడిని నియమిస్తాం. రాజకీయాల్లో రావాల్సిన వాటాను ఢిల్లీ నుంచి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాం. మీ అభివృద్ధికి పాటు పడుతాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
నవంబర్ 26, 2026

Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!
నవంబర్ 26, 2026

YS Jagan | పాలమూరు – రంగారెడ్డి ముందు పోతిరెడ్డి పాడు తీసికట్టు
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
- ●Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
- ●Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?
- ●Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..
- ●Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!
- ●Arjun | దేశభక్తి కథతో అర్జున్ సినిమా - అయోధ్యలో లాంఛ్ - స్టోరీ రైటర్‌గా ఆర్మీ మేజర్

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?

Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..



