త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gabriel India | 10 ఏళ్ల‌లో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్‌.. రూ.1 ల‌క్షకు రూ.12.5 ల‌క్ష‌లు..

Gabriel India | ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ గాబ్రియేల్ ఇండియా షేర్లు పదేళ్లలో అద్భుతమైన రాబడిని అందించాయి. 2016 నవంబర్‌లో సుమారు రూ.120గా ఉన్న ఒక్కో షేరు ధర ఈ నవంబర్ నాటికి రూ.1,500కు చేరింది. దీంతో పదేళ్ల క్రితం ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి డివిడెండ్లను మినహాయించి ప్రస్తుతం రూ.12.5 లక్షల విలువైన పెట్టుబడి ఏర్పడింది.

S

Business | Published On Nov 26, 2026, 4.57 pm IST

Gabriel India | 10 ఏళ్ల‌లో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్‌.. రూ.1 ల‌క్షకు రూ.12.5 ల‌క్ష‌లు..
Advertisement

Gabriel India | ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ గాబ్రియేల్ ఇండియా షేర్లు పదేళ్లలో అద్భుతమైన రాబడిని అందించాయి. 2016 నవంబర్‌లో సుమారు రూ.120గా ఉన్న ఒక్కో షేరు ధర ఈ నవంబర్ నాటికి రూ.1,500కు చేరింది. దీంతో పదేళ్ల క్రితం ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి డివిడెండ్లను మినహాయించి ప్రస్తుతం రూ.12.5 లక్షల విలువైన పెట్టుబడి ఏర్పడింది.

భారీగా పెరిగిన ఆదాయం..

గాబ్రియేల్ ఇండియా గత పదేళ్లలో తన వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించడంతోపాటు ఆర్థికంగా కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ.1,426 కోట్లుగా ఉన్న కంపెనీ స్టాండలోన్ అమ్మకాలు 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.4,233 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో పన్నుల అనంతర లాభం (పీఏటీ) రూ.75 కోట్ల నుంచి రూ.243 కోట్లకు చేరింది. అయితే ఈ పదేళ్లలో ఈబీఐటీడీఏ మార్జిన్ మాత్రం దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. సంప్రదాయ షాక్ అబ్జార్బర్లు, ఫ్రంట్ ఫోర్క్స్ తయారీ నుంచి సన్‌రూఫ్‌లు, గ్యాస్ స్ప్రింగ్స్, డ్రైవ్‌ట్రెయిన్ ఉత్పత్తులు, సింక్రొనైజర్ రింగ్స్, అల్యూమినియం ఫోర్జింగ్స్, ఆటోమొబైల్ ఫాస్టెనర్లు, వాహనాల బాడీ నిర్మాణ భాగాలు, నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్ సొల్యూషన్స్ వరకు కంపెనీ తన ఉత్పత్తుల విస్తృతిని పెంచుకుంది. 2016లో 6వేలుగా ఉన్న రిటైల్ ఔట్‌లెట్లు ప్రస్తుతం 30వేల‌కు పైగా చేరాయి. వ్యాపార భాగస్వాముల సంఖ్య కూడా 375 నుంచి 800కు పెరిగింది.

ఏమేం త‌యారు చేస్తుంది..?

ప్రస్తుతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విభాగంలో 32 శాతం, ప్యాసింజర్ వాహనాల్లో 25 శాతం, వాణిజ్య వాహనాల్లో 88 శాతం మార్కెట్ వాటాను కంపెనీ కలిగి ఉంది. అయినప్పటికీ మొత్తం అమ్మకాలలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విభాగం నుంచే సుమారు 62 శాతం ఆదాయం వస్తోంది. ఇతర విభాగాల్లో విస్తరణ ద్వారా ఈ ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మారెల్లీ మదర్సన్ ఆటో సస్పెన్షన్ పార్ట్స్ కొనుగోలు ద్వారా షాక్ అబ్జార్బర్ల తయారీ సామర్థ్యంతో పాటు గ్యాస్ స్ప్రింగ్స్ వ్యాపారాన్ని విస్తరించింది. ఇనాల్ఫాతో భాగస్వామ్యం ద్వారా సన్‌రూఫ్ వ్యాపారాన్ని బలోపేతం చేసుకుంది. ఎస్‌కే ఎన్‌మూవ్, జిన్‌హాప్ సంస్థలతో భాగస్వామ్యాలు కందెనలు, ఈ-ఫ్లూయిడ్స్, ఆటోమొబైల్ ఫాస్టెనర్ల విభాగాల్లోకి ప్రవేశించేందుకు దోహదపడ్డాయి. ఫోర్వియాతో జాయింట్ వెంచర్ ద్వారా ప్యాసింజర్ వాహనాల సీటు నిర్మాణాలు, పూర్తి సీట్ల తయారీలోకి అడుగుపెట్టింది.

19.3 శాతం పెరిగిన ఆదాయం..

2027 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 19.3 శాతం పెరిగి రూ.3,034 కోట్లకు చేరింది. ఈబీఐటీడీఏ 8.6 శాతం వృద్ధితో రూ.265 కోట్లకు, పన్నులకు ముందు లాభం (పీబీటీ) 10 శాతం పెరిగి రూ.281 కోట్లకు చేరింది. రానున్న కాలంలో కొత్త వ్యాపార విభాగాలను మరింత విస్తరించడం, వాటి ద్వారా లాభాల వాటాను పెంచుకోవడంపైనే కంపెనీ వృద్ధి ఆధారపడి ఉంటుంది. అయితే ఆటోమొబైల్ రంగంలో తీవ్ర పోటీ, సాంకేతిక మార్పులు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మార్కెట్‌పై అధిక ఆధారపడడం కంపెనీకి ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి.

Advertisement
Advertisement