IBM | టెకీలకు ఐబీఎం షాక్.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేసిన టెక్ దిగ్గజం
IBM | టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ కన్సల్టింగ్ విభాగంలోని (US consulting business) మెజారిటీ ఉద్యోగాలకు సంబంధించి హెచ్-1బీ (H-1B) వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను (green card sponsorship) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
IBM | త్రినేత్ర న్యూస్ : అమెరికాలో ట్రంప్ యంత్రాంగం (Trump administration) విదేశీ నియామకాలు, వర్క్ వీసా నిబంధనలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ కన్సల్టింగ్ విభాగంలోని (US consulting business) మెజారిటీ ఉద్యోగాలకు సంబంధించి హెచ్-1బీ (H-1B) వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను (green card sponsorship) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అమెరికాలో శాశ్వత నివాసం (Permanent Residency) కోసం, అలాగే వర్క్ వీసా స్పాన్సర్‌షిప్ కోసం కంపెనీపై ఆధారపడిన ఐబీఎం కన్సల్టింగ్ విభాగానికి చెందిన వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఇందులో 1,50,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. నైపుణ్యాల లభ్యత, క్లయింట్ల అవసరాలు మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రభావితమైన ఉద్యోగులకు ఐబీఎం రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. అమెరికా వెలుపల నుంచి సంస్థ కోసం పనిచేయడం కొనసాగించడం లేదంటే ఈ ఏడాది చివరిలోగా ఉద్యోగాన్ని వదులుకునే ఆప్షన్ ఇచ్చింది. అయితే ఇప్పటికే హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పెర్మ్‌కూ వర్తిస్తుంది..
ఈ నిర్ణయం హెచ్-1బీ వీసా దరఖాస్తులతో పాటు పెర్మ్ (PERM) ప్రక్రియకూ వర్తించనుంది. ఎంప్లాయ్‌మెంట్-బేస్డ్ గ్రీన్ కార్డ్ కేటగిరీలో అత్యంత సాధారణమైన తొలి దశ ప్రక్రియే ఈ పెర్మ్. విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకునే ముందు ఆ ప్రత్యేక ఉద్యోగానికి తగిన అర్హతలు, నైపుణ్యాలు కలిగిన అమెరికన్ కార్మికులు అందుబాటులో లేరని యజమాని (Employer) నిరూపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే హెచ్-1బీ వీసాపై పనిచేస్తూ, సంస్థ ద్వారా శాశ్వత నివాస హోదా పొందాలని ఆశిస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఇంకా తెలియరాలేదు. ఈ అంశంపై ఐబీఎం నుంచి మరింత వివరణ కోరినట్లు తెలుస్తోంది.
ఐబీఎం చాలా తక్కువ
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ డేటా ప్రకారం.. సెప్టెంబర్ 30తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో ఐబీఎం కేవలం 1,100కి పైగా హెచ్-1బీ వీసాల కోసం మాత్రమే దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ తర్వాత వీరిలో ఎంతమంది ఉద్యోగులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారనేదానిపై స్పష్టత లేదు. ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే ఐబీఎం వీసా దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం అమెరికా వీసా కార్యక్రమాల్లో కంపెనీ భాగస్వామ్యం గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోందని ఐబీఎం ప్రతినిధి తెలిపారు.
అమెజాన్ టాప్
భారత్‌కు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఎక్కువగా హెచ్-1బీ వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ వీసాలతోనే భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇందులో అమెజాన్ (Amazon) సంస్థ టాప్‌లో ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ (TCS) రెండోస్థానంలో నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్ (Amazon) 13,715 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇది ఐబీఎం సంఖ్య కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. యాపిల్ (Apple), మెటా (Meta), మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థలు కూడా ఐబీఎంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు అధిక వీసాలను కోరాయి.
Also Read..
కొండగట్టులో చెక్కతో చేసిన అంజన్న విగ్రహం..
హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర మాసం.. ఒక్క దీపంతోనే అనంత పుణ్యఫలం!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heart Attack| పిల్లలతో ఆడుకుంటుండగా గుండెపోటు.. కుర్చీలోనే కుప్పకూలిన టెకీ
సెప్టెంబర్ 15, 2026

America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?
జులై 11, 2026

H-1B Visa | ఫీజు భారీగా పెంచినా H-1B వీసాలకు తగ్గని డిమాండ్.. ఏడాదిలో 2 లక్షల దరఖాస్తులు
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ జోరు.. సెన్సెక్స్ 1,300 పాయింట్లు అప్..
- ●Kondagattu | కొండగట్టులో చెక్కతో చేసిన అంజన్న విగ్రహం..
- ●Karthika Masam | హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర మాసం.. ఒక్క దీపంతోనే అనంత పుణ్యఫలం!
- ●Dasyam Vinay Bhaskar | న్యాయం చేయండి అని అడిగితే.. అర్ధరాత్రి అరెస్టులా..?
- ●Dense Fog | పొగ మంచు ఎఫెక్ట్.. 86 వాహనాలు ఢీ.. 12 మంది మృతి
- ●Murder | ప్రియుడితో ఏకాంతంగా వివాహిత.. అది చూశాడని బాలుడి హత్య

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ జోరు.. సెన్సెక్స్ 1,300 పాయింట్లు అప్..

Kondagattu | కొండగట్టులో చెక్కతో చేసిన అంజన్న విగ్రహం..

Karthika Masam | హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర మాసం.. ఒక్క దీపంతోనే అనంత పుణ్యఫలం!

Dasyam Vinay Bhaskar | న్యాయం చేయండి అని అడిగితే.. అర్ధరాత్రి అరెస్టులా..?



