Eatala Rajender | కాంగ్రెస్ పార్టీ మరో 15 ఏళ్లు అధికారంలోకి రాదు
Eatala Rajender | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు.. కోటి ఓట్లు వస్తాయని రేవంత్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడు.. కానీ ఆ పార్టీ మరో 15 ఏళ్లు అధికారంలోకి రాదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
రేవంత్‌ది ఒక అసమర్థ పాలన
ఒక్క సీజన్‌కి కరువు వస్తేనే చేతులెత్తేశారు
పండిన కాస్త పంట కూడా కొనుగోలు చేయలేక పోతున్నారు
రేవంత్ 90 సీట్లు.. కోటి ఓట్లు వస్తాయి అని భ్రమల్లో బ్రతుకుతున్నాడు
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శ
Eatala Rajender | త్రినేత్ర న్యూస్ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు.. కోటి ఓట్లు వస్తాయని రేవంత్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడు.. కానీ ఆ పార్టీ మరో 15 ఏళ్లు అధికారంలోకి రాదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎంపీ ఈటల మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది కానీ ఏ సమస్యకు సరైన పరిష్కారం అందించలేక పోతుంది. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను ఇంత భయంకరమైన కరువును ఎప్పుడూ చూడలేదు. కరువు వస్తుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు కానీ ప్రభుత్వం మేల్కోకపోవడం వల్ల తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పండిన పంట కూడా కొనే దిక్కులేదు. ఐకెపి సెంటర్లు ఓపెన్ కాలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వెంటనే కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. రూ. 500 అదనంగా ఇస్తాను ఒక కిలో కూడా బయట అమ్మకండి నేనే కొంటా అని చెప్పారు కానీ కొనడం లేదు. మొక్కజొన్నలు కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడితే రూ. 1800 రూపాయలకే అమ్ముకున్నారు. చివరికి రైతులు తిరుగుబాటు చేస్తే కొన్నారు. ఇప్పుడు పండిన ధాన్యం కూడా మిల్లర్లు కొంటున్నారు తప్ప ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే ప్రయత్నంలో ప్రజలను బోనులో పెట్టారు
వచ్చే ఎండాకాలం పంటలు ఉండేటట్టు కనిపించడం లేదు. పంటలు పండక పోతే బట్టల షాపులు, కిరాణా షాపులు నడవవు. స్కూలు ఫీజులు సరిగా చెల్లించలేరు. పెళ్లిళ్లు కూడా వాయిదా చేసుకోవాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. అందరికంటే ముందు నేను చెప్పాను కాలేశ్వరం ప్రాజెక్టు లింక్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో కరువు లేదు. ఎండాకాలంలో కూడా ప్రాణహిత నీళ్లు వస్తాయి ఎత్తిపోసుకోండి అని చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే ప్రయత్నంలో ప్రజలను బోనులో పెట్టారు. రైతులను ఇబ్బంది పెట్టారు అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
పంటలు వేయకండి చెప్పిన అసమర్థ ప్రభుత్వం ఇది
రేవంత్ రెడ్డి 90 సీట్లు వస్తాయి కోటి ఓట్లు వస్తాయి అని భ్రమల్లో బ్రతుకుతున్నాడు. 100 శాతం ఓడిపోతున్నానని రేవంత్‌కు అర్థమైంది. కనీసం ఉన్న రెండు సంవత్సరాలైనా అధికారులు వింటారో వినరో అని భ్రాంతి కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మరో 10 -15 ఏళ్లు అధికారంలోకి రాదు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. గతంలో నాలుగేళ్లు కరువును తట్టుకున్నాము కానీ ఒక్క కరువుకే చేతులెత్తేసి పంటలు వేయకండి చెప్పిన అసమర్థ ప్రభుత్వం ఇది అని ఈటల రాజేందర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
నవంబర్ 26, 2026

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
నవంబర్ 26, 2026

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ ‘400 పార్’ నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
- ●TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
- ●Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
- ●Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?
- ●Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..
- ●Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?



