Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లుల (Women reservation Bill) ను ఎలాగైనా సరే పార్లమెంటులో ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ఎన్డీఏ (NDA) పక్షం నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు ప్రత్యేక సమావేశాలు (Special session of Parliment) నిర్వహించనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం
నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్ జరగనున్నది
సంక్షిప్త సారాంశం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే సంప్రదాయం ప్రకారం కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నిబంధనల్లోని రూల్ 15 తెరపైకి వచ్చింది. రూల్ 15 ప్రకారం.. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, సమావేశాల సమాప్తి (ప్రొరోగేషన్) అధికారికంగా జరగనంత వరకు స్పీకర్ కు తిరిగి సభను సమావేశపరిచే అధికారం ఉంది. ఈ ఏడాదిఆగస్టు 13న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి శీతాకాల సమావేశాలకు బదులుగా వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు.
-
నవంబర్ 30నే పార్లమెంట్ సెషన్?
-
డిసెంబరు 2 వరకు వరుసగా 3 రోజులు సమావేశాలు
-
డీలిమిటేషన్ బిల్లు ఆమోదమే లక్ష్యం
-
పూర్తిస్థాయి శీతాకాల సమావేశాలకు బదులుగా
-
ప్రత్యేక సమావేశాల్లో బిల్లులపై చర్చ, ఓటింగ్
-
సంఖ్యాబలంపై ఎన్డీయే తీవ్ర కసరత్తు
-
మూడింట రెండొంతుల మెజారిటీ కోసం సంప్రదింపులు
-
ప్రతిపక్ష పార్టీల్లో చీలికలతో పెరిగిన ఎన్డీయే బలం
-
లోక్‌సభలో 320కి చేరువైన అధికార కూటమి సంఖ్యాబలం
-
డీఎంకే, ఎన్సీపీ, వైఎస్సార్సీపీల వైపు చూపు
-
ప్రాంతీయ పార్టీల మద్దతుపై బీజేపీ నాయకత్వం దృష్టి
త్రినేత్ర న్యూస్: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లుల (Women reservation Bill) ను ఎలాగైనా సరే పార్లమెంటులో ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ఎన్డీఏ (NDA) పక్షం నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు ప్రత్యేక సమావేశాలు (Special session of Parliment) నిర్వహించనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు..నవంబరు 30నే సమావేశాలకు అందుబాటులో ఉండాలంటూ ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నింటికీ బుధ, గురువారాల్లో సమాచారం చేరింది.పంజాబ్‌లో డిసెంబర్ 8న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) సంయుక్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. ఈ సభకు ముందే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించే అవకాశముందని తెలుస్తున్నది
నిబంధన 15 ప్రకారమే
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే సంప్రదాయం ప్రకారం కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నిబంధనల్లోని రూల్ 15 తెరపైకి వచ్చింది. రూల్ 15 ప్రకారం.. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, సమావేశాల సమాప్తి (ప్రొరోగేషన్) అధికారికంగా జరగనంత వరకు స్పీకర్ కు తిరిగి సభను సమావేశపరిచే అధికారం ఉంది. ఈ ఏడాదిఆగస్టు 13న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి శీతాకాల సమావేశాలకు బదులుగా వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు.
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు?
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026లను పార్లమెంట్‌లో ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం తుది కసరత్తు పూర్తి చేసింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన కేంద్రం ముందున్నది. అన్ని రాష్ట్రాల్లో దాదాపు 50 శాతం చొప్పున స్థానాలను పెంచే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

రాజ్యాంగ సవరణకు మరో 40 మంది ఎంపీల మద్దతు
ఈ ఏడాది ఏప్రిల్‌లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. అప్పటి నుంచి పార్లమెంట్‌లో సంఖ్యాబలాన్ని పెంచుకోవడంపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 293 స్థానాలు సాధించిన ఎన్డీయేకు ప్రస్తుతం 319 నుంచి 320 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు ఎన్డీఏ పేర్కొంటున్నది. తృణమూల్ కాంగ్రెస్‌నుంచి 20 మంది ఎంపీలు వేరుపడి నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ద్వారా ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరడం ద్వారా ఎన్డీఏ బలం పెరిగింది. ఇలా ప్రతిపక్షాల్లో చీలిక తీసుకురావడం ద్వారా సంఖ్యాబలం పెంచుకున్నప్పటికీ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి మరో 40 మంది ఎంపీల మద్దతు అవసరం.

డీఎంకే (DMK), శరద్ పవార్ (NCP) వర్గంపై దృష్టి
లోక్‌సభలో 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఎంపీలున్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ లపై ఎన్డీఏ దృష్టి పెట్టింది. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో డీఎంకే సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే మద్దతు పొందేందుకు బీజేపీ ప్రయత్నించినట్టు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గబోదనే హామీ ద్వారా ఆయా పార్టీల అభ్యంతరాలను పరిష్కరించి బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. అయినా సరే. ఎన్డీయేకు మరో 10 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. దీంతో వైఎస్సార్‌సీపీ, ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర ఎంపీల వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజ్యసభలో మరో 11 మంది అవసరం
రాజ్యసభలో ఎన్డీయేకు అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 153.. మొత్తం 245 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు ఆమోదానికి 164 మంది మద్దతు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో డీఎంకేకు చెందిన 8 మంది, బిజూ జనతాదళ్‌కు చెందిన ఐదుగురు, వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు, బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు సభ్యుల వైపు ఎన్డీయే దృష్టి సారించింది.

2 రోజుల ముందు నోటీసిస్తాం. ..2/3 కన్నా 15 ఓట్లు ఎక్కువే ఉన్నాయి : నవంబరు 12 న ఢిల్లీలో అమిత్ షా
ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. అంతేగాని ముగిసిపోయినట్టు (ప్రొరోగ్ అయినట్టు) ఇంకా ప్రకటించలేదు. నిబంధనల ప్రకారం ప్రొరోగ్ కాని సందర్భంలో సభ్యులకు 48 గంటల ముందు (రెండు రోజుల ముందు) నోటీసులు ఇస్తే సరిపోతుంది. నవంబరు నెలాఖరులో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండో వంతు మెజారిటీ కంటే మాకు 15-18 ఓట్లు ఎక్కువే ఉన్నాయి. డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇవే సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్‌సీఆర్‌ఏ) సంబంధించిన సవరణ బిల్లును కూడా తీసుకొస్తాం.

సంబంధిత వార్తలు

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
నవంబర్ 21, 2026

Special Parliament Session | త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : ప్రభుత్వ వర్గాలు
నవంబర్ 12, 2026

Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్
నవంబర్ 12, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
- ●TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
- ●Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
- ●Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..
- ●Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!
- ●Arjun | దేశభక్తి కథతో అర్జున్ సినిమా - అయోధ్యలో లాంఛ్ - స్టోరీ రైటర్‌గా ఆర్మీ మేజర్

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..



