RRB JE Recruitment | 4098 పోస్టులతో ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్..
RRB JE Recruitment | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 4,098 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ (RRB JE Recruitment) ప్రారంభించింది.
RRB JE Recruitment | త్రినేత్ర.న్యూస్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 4,098 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ (RRB JE Recruitment) ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌లో ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.35,400 లభిస్తుంది. ఇతర అదనపు అలవెన్సులు ఉంటాయి. మొత్తం 21 రీజియన్లలో ఈ పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ రీజియన్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి.
21 రీజియన్లు..
సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం.
మొత్తం పోస్టులు: 4098
జేఈ 3,749, డీఎంఎస్ 314, సీఎంఏ 35 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జనవరి 1, 2027 నాటికి అభ్యర్థులు 18 నుంచి 33 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
జేఈ పోస్టులకు- సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్
డీఎంఎస్ పోస్టులకు- ఇంజినీరింగ్, టెక్నికల్ క్వాలిఫికేషన్
సీఎంఏ పోస్టులకు- డిగ్రీలో మెటల్లర్జీ, కెమిస్ట్రీ
ఎంపిక విధానం: ముందుగా స్టేజ్-1, స్టేజ్-2 అని రెండు విడతల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు(సీబీటీ) నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
స్టేజ్-1 రాతపరీక్షలో.. 100 మార్కులు, 100 ప్రశ్నలు అడుగుతారు. గణితం 30, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ 25, జనరల్ అవేర్‌నెస్ 15, జనరల్ నాలెడ్జ్ 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
స్టేజ్-2 రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్ 15, ఫిజిక్స్, కెమిస్ట్రీ 15, కంప్యూటర్ అప్లికేషన్స్ 10, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10, టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 100 చొప్పున ప్రశ్నలు వస్తాయి. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు.
దరఖాస్తులు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 13
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/
సంబంధిత వార్తలు

SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
సెప్టెంబర్ 3, 2026

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
ఆగస్టు 14, 2026

BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను
జులై 25, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



