Accident Insurance Scheme | ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం.. రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ప్రయోజనం
Accident Insurance Scheme | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Govt Employees) సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని (Accident Insurance Scheme) ప్రారంభించనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Accident Insurance Scheme | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Govt Employees) సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని (Accident Insurance Scheme) ప్రారంభించనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉద్యోగలు సమక్షంలో మొత్తం 14 బ్యాంకులు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు ప్రమాద బీమా వర్తించనుంది. వీరితోపాటు కాంట్రాక్టు, పొరుగుసేవల వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు తెలుస్తున్నది. దీనిద్వారా దాదాపు పది లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగనుంది.
ప్రీమియం లేకుండానే..
దీనికోసం ఉద్యోగులు ప్రీమియం కింద ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. సాలరీ ఖాతాలున్న బ్యాంకుల ద్వారా పథకం అమలుచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే వారి సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకులో నామినీకి రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ బీమా పరిహారం లభిస్తుంది. అయితే పరిహారం ఎంత ఇవ్వాలనే అంశంపై ఒక్కో బ్యాంకు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. కొన్ని బ్యాంకులు రూ.60 లక్షల నుంచి రూ.కోటి పరిహరం ఇస్తామని ప్రకటించగా, అత్యధిక వేతన ఖాతాలున్న బ్యాంకులు రూ.కోటి ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే సింగరేణిలో..
ప్రమాద జీవిత బీమా పథకం ఇప్పికే సింగరేణి ఉద్యోగులకు అమల్లో ఉన్నది. 2024లో యూనియన్ బ్యాంకు మొదటగా సింగరేణి ఉద్యోగులకు బీమా పథకాన్ని ప్రారంభించింది. దీనిని మిగిలిన బ్యాంకులు కూడా అనుసరిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 45 మంది ఉద్యోగులు ప్రమాదాల్లో మరణించగా వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని బ్యాంకులు చెల్లించాయి. ఇటీవల సహజ మరణాలకు కూడా రూ.10 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చాయి.
సంబంధిత వార్తలు

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
సెప్టెంబర్ 20, 2026

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి
సెప్టెంబర్ 20, 2026

Bhadradri Kothagudem | ఆడుకుంటూ కారెక్కిన చిన్నారి.. అంతలోనే డోర్ లాక్.. తర్వాత ఏమైందంటే!
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!

Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి



