Ketan Agarwal Murder Case | అవును.. నేనే లోయలోకి తోసి చంపేశా.. తప్పు ఒప్పుకున్న పుణే యువతి సియా
పుణేలో విషాదం.. లోహగడ్ ఫోర్ట్ వద్ద ఫోటోలు దిగుతూ యువకుడు మృతి చెందాడనుకుంటే, విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలేం జరిగిందంటే?
- రూ.17 కోట్ల ప్యాలెస్‌లో పెళ్లి.. కానీ అంతలోనే దారుణం
- లోయలోకి నెట్టేసిన కాబోయే భార్య
- పుణే మర్డర్ మిస్టరీలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు
- పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ అగర్వాల్ (26) దారుణ హత్య
- లోహగడ్ ఫోర్ట్ పైనుంచి 400 అడుగుల లోయలోకి తోసేసిన కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్
- రూ.17 కోట్లతో రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగానే ఈ దారుణం
- కాల్ డేటా, అనుమానాస్పద ప్రవర్తన ఆధారంగా మిస్టరీని ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Ketan Agarwal Murder Case | త్రినేత్ర.న్యూస్ : పుణేకు (Pune) చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగుచూశాయి. లోహగడ్ ఫోర్ట్ (Lohagad Fort) వద్ద ఫోటోలు దిగుతూ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడని అంతా భావించిన ఈ ఘటన.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ (Murder) అని తేలింది. కాబోయే భార్య, ఆమె ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిసి రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

డ్రీమ్ వెడ్డింగ్.. అంతలోనే విషాదం
కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పుణేలో పెద్ద బిల్డర్. కేతన్‌కు 20 ఏళ్ల సియా గోయల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ (Engagement) జరిగింది. నవంబర్ 25న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. దీనికోసం ఏకంగా రూ. 17 కోట్లు వెచ్చించి జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌ను బుక్ చేశారు. బంధువులను తీసుకెళ్లేందుకు రెండు చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా రెడీ చేశారు. అంతా సంతోషంగా పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా, జూన్ 18న కేతన్ మరణవార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

జూన్ 14న ఫెయిల్.. జూన్ 18న సక్సెస్!
సియా అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో ఉంది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది.
తొలి ప్రయత్నం: జూన్ 14న ట్రెకింగ్ (Trekking) పేరుతో కేతన్‌ను లోహగడ్ ఫోర్ట్‌కు తీసుకెళ్లింది. అక్కడ కొండ అంచున ఉన్నప్పుడు కిందకు తోసేసింది. కానీ, అదృష్టవశాత్తూ కేతన్ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తనను పాము కరవబోతుంటే కాపాడేందుకే అలా నెట్టేశానని సియా అబద్ధం చెప్పి అతడిని నమ్మించింది.

రెండో ప్రయత్నం: ఆ తర్వాత జూన్ 18న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని బలవంతంగా కేతన్‌ను మళ్లీ అదే లోహగడ్ ఫోర్ట్‌కు ఒప్పించి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రియుడు చేతన్‌తో కలిసి.. కేతన్‌ను 400 అడుగుల లోతైన లోయలోకి (Gorge) అత్యంత కిరాతకంగా నెట్టేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడని పోలీసులకు, కుటుంబ సభ్యులకు కట్టుకథ అల్లింది.

పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు..
తమ కుమారుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రెక్కర్ అని, అంత సులభంగా జారిపడిపోడని కేతన్ తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. సియా ప్రవర్తనపై కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పుణే రూరల్ పోలీసులు (Pune Rural Police) సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను (Call Data) విశ్లేషించారు.

జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో సియా, చేతన్‌ల మధ్య ఏకంగా 2,004 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 238 గంటల పాటు వీరు ఫోన్‌లో సంభాషించారు.
ప్రియుడి మాస్టర్ ప్లాన్.. కానీ
పోలీసులకు దొరకకూడదని ప్రియుడు చేతన్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. జూన్ 18న తన మొబైల్ ఫోన్‌ను షాపులోనే వదిలేసి, అందులో ఇంటర్నెట్ ఆఫ్ చేశాడు. తన లొకేషన్ ట్రేస్ కాకుండా తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి ఫోన్‌ను లోహగడ్ ఫోర్ట్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడికి కాల్ చేసిన వాళ్లతో షాపులోని వర్కర్లు మాట్లాడారు. కానీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్, సాక్షుల విచారణతో పోలీసులు అసలు నిజాన్ని రాబట్టారు. ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించగా, తామే హత్య చేసినట్లు నేరం అంగీకరించారని పూణే రూరల్ ఎస్పీ (SP) సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు.

పెళ్లి ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకునే వాళ్లమని.. కానీ ఇంత దారుణంగా తమ బిడ్డను పొట్టనపెట్టుకున్న నిందితులకు కఠిన శిక్ష, ఉరిశిక్ష విధించాలని కేతన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
తాజావార్తలు
- ●Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి
- ●Rains | పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు.. రాత్రి పూట మోస్తరు వర్షాలు
- ●Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా
- ●Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'
- ●Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!
- ●KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్

Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి

Rains | పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు.. రాత్రి పూట మోస్తరు వర్షాలు

Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా

Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'



