Meta Glasses | మెటా స్మార్ట్ గ్లాసెస్ వచ్చేశాయి.. అధునాతన ఏఐతో రియల్‌టైమ్‌లో పనిచేస్తాయి..
Meta Glasses | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, ప్రముఖ ఐవేర్ కంపెనీ ఎస్సిలార్ లక్సోటికా భాగస్వామ్యంతో కొత్త మెటా గ్లాసెస్ స్మార్ట్ ఐవేర్‌ను విడుదల చేసింది. రోజంతా ఉపయోగించగలిగే మల్టీమోడల్ ఏఐ అసిస్టెంట్‌గా పనిచేసేలా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించారు.
Technology | Published On Jun 24, 2026, 10.37 am IST
Meta Glasses | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, ప్రముఖ ఐవేర్ కంపెనీ ఎస్సిలార్ లక్సోటికా భాగస్వామ్యంతో కొత్త మెటా గ్లాసెస్ స్మార్ట్ ఐవేర్‌ను విడుదల చేసింది. రోజంతా ఉపయోగించగలిగే మల్టీమోడల్ ఏఐ అసిస్టెంట్‌గా పనిచేసేలా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించారు. ఇప్పటికే ఉన్న స్మార్ట్ గ్లాసెస్ శ్రేణిని మరింత విస్తరించేలా కొత్త ఫ్రేమ్ డిజైన్లు, మెరుగైన హార్డ్‌వేర్, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ ఉత్పత్తిని తీసుకొచ్చారు. కొత్త మెటా గ్లాసెస్ శ్రేణిలో వినియోగదారుల అభిరుచులు, ముఖాకారాలకు అనుగుణంగా మూడు ప్రత్యేక ఫ్రేమ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. మెటా అడ్వెంచరర్ క్లాసిక్ రెక్టాంగులర్ డిజైన్‌లో స్టాండర్డ్, లార్జ్ సైజుల్లో లభిస్తుంది. మెటా ఫ్యూరీని మరింత బోల్డ్ లుక్‌తో రూపొందించారు. మెటా గ్లాసెస్ బై కైలీ పేరుతో వచ్చిన స్లిమ్ ఓవల్ డిజైన్‌ను ప్రముఖ సెలబ్రిటీ కైలీ జెన్నర్ సహకారంతో అభివృద్ధి చేశారు. వియరబుల్ టెక్నాలజీ విభాగంలో ఆమెకు ఇదే తొలి ప్రవేశంగా కంపెనీ పేర్కొంది.
ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లకు ప్రత్యేక ప్రోగ్రామ్..
ఈ గ్లాసెస్ క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ టార్టాయిస్, రేసింగ్ గ్రీన్, లినెన్, మెర్లాట్, మహాగనీ, శాండ్‌స్టోన్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 26 స్టైల్ కాంబినేషన్లు వినియోగదారులకు లభిస్తున్నాయి. లెన్స్‌లలో సన్, పోలరైజ్డ్, క్లియర్, ట్రాన్సిషన్స్ లను అందిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను ఉపయోగించే వారి కోసం కొత్త ఆర్‌ఎక్స్ లెన్స్ స్వాప్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టారు. గ్లాసెస్ కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులు తమకు నచ్చిన ఆప్టిషియన్ ద్వారా ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను అమర్పించుకోవచ్చు. ఇలా చేసినా ఉత్పత్తి వారంటీపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. దీర్ఘకాలం సౌకర్యవంతంగా ధరించేందుకు మూడు దిశల్లో సర్దుబాటు చేసుకునే నోస్ ప్యాడ్స్, అడ్జస్టబుల్ టెంపుల్ టిప్స్, ఓవర్ ఎక్స్‌టెన్షన్ హింజ్‌లను ఇచ్చారు. హార్డ్‌వేర్ ఫీచర్లలో ప్రత్యేక యాక్షన్ బటన్ ఉండగా, దీని ద్వారా మెటా ఏఐని నేరుగా యాక్టివేట్ చేయవచ్చు, అలాగే ముందుగా సెట్ చేసిన షార్ట్‌కట్‌లను ప్రారంభించవచ్చు.
40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
ఓపెన్-ఇయర్ ఆడియో వ్యవస్థ ద్వారా సంగీతం వినడం, పోడ్‌కాస్ట్‌లు వినడం, కాల్స్ మాట్లాడడం సాధ్యమవుతుంది. అలాగే చుట్టుపక్కల శబ్దాలను కూడా వినగలిగేలా డిజైన్ చేశారు. కొత్త మల్టీ-మైక్ అరే విండ్ నాయిస్ తగ్గింపుతో మెరుగైన వాయిస్ కమాండ్లు, స్పష్టమైన కాల్స్‌ను అందిస్తుంది. గ్లాసెస్‌లోని కెమెరాల సహాయంతో హ్యాండ్స్-ఫ్రీగా ఫోటోలు, వీడియోలు క్యాప్చర్ చేయవచ్చు. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్ఠంగా 8 గంటల వరకు పనిచేస్తాయి. ఉత్పత్తితోపాటు వచ్చే ఫోల్డబుల్ పోర్టబుల్ చార్జింగ్ కేస్ ద్వారా అదనంగా 40 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అలాగే ప్రత్యేకంగా విక్రయించే మెటా గ్లాసెస్ చార్జింగ్ స్టాండ్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఈ గ్లాసెస్‌లోని ప్రధాన ఆకర్షణ మెటా ఏఐ. మ్యూస్ స్పార్క్ అనే మోడల్ ఆధారంగా పనిచేసే ఈ ఏఐని మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ప్రత్యేకంగా హార్డ్‌వేర్ పరికరాల కోసం అభివృద్ధి చేసింది. వినియోగదారు చూసే విషయాలను రియల్ టైమ్‌లో అర్థం చేసుకుని స్పందించే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ మ్యూస్ స్పార్క్ అప్‌డేట్ ప్రస్తుతం మెటా గ్లాసెస్ నియోగదారులకు అమెరికా, కెనడాలో అందుబాటులోకి వచ్చింది.
ధర ఎంతంటే..
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లలో భాగంగా ఈ నెలలో డైనమిక్ ఫోటో ఫీచర్ విడుదల కానుంది. ఇది ఒకేసారి అనేక ఫ్రేమ్‌లను క్యాప్చర్ చేసి ఉత్తమ ఫోటోను సూచిస్తుంది. అలాగే డిస్‌ప్లే లేకుండా పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ కోసం ప్రత్యేకంగా టర్న్-బై-టర్న్ ఆడియో నావిగేషన్ ఫీచర్‌ను తీసుకురానున్నారు. లైవ్ ట్రాన్స్‌లేషన్ సామర్థ్యాన్ని కూడా అప్‌డేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న భాషలకు అదనంగా మాండరిన్ చైనీస్, జపనీస్, హిందీ, కొరియన్ సహా 14 కొత్త భాషలను అందించనున్నారు. దీంతో రియల్ టైమ్ సంభాషణల అనువాదం మరింత విస్తృతంగా అందుబాటులోకి రానుంది. మెటా గ్లాసెస్ నేటి నుంచే విక్రయాలకు అందుబాటులోకి వచ్చాయి. మెటా స్టోర్ తోపాటు లెన్స్ క్రాఫ్టర్స్, సన్‌గ్లాస్ హట్, బెస్ట్ బై, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ధర 299 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.28,315)గా ఉంది. అయితే భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై మెటా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
తాజావార్తలు
- ●Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్‌డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
- ●Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్రణాళికలు వెల్లడి..
- ●Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
- ●Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
- ●TG TET | తెలంగాణ టెట్ ఫలితాలు ఎప్పుండంటే?.. సర్కార్ బడుల్లో ఖాళీగా 14 వేల టీచర్ పోస్టులు!
- ●CM family Land Scam | సీఎం కుటుంబం వందల ఎకరాల భూ స్కామ్.. సంచలనం రేపుతున్న నివేదిక

Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్‌డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..

Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్రణాళికలు వెల్లడి..

Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన






