త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire at petrol pump | పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్ర‌మాదం.. 12 మందికి గాయాలు.. కాలిబూడిదైన ద్విచ‌క్ర వాహ‌నాలు

Fire at petrol pump | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాజ్‌గ‌ఢ్‌ జిల్లాలో ఓ పెట్రోల్ బంకులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. బైక్‌కు ఇంధ‌నం నింపుతుండ‌గా అక‌స్మాత్తుగా నిప్పుర‌వ్వ‌లు ఎగ‌సిప‌డ్డాయి. అదే స‌మ‌యంలో అక్క‌డే ఫుల్ లోడుతో ఉన్న ఓ డీజిల్ ట్యాంక‌ర్‌కు మంట‌లు అంటుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 12 మంది గాయ‌ప‌డ్డారు. డ‌జ‌నుకు పైగా ద్విచ‌క్ర వాహ‌నాలు కాలిబూడిద‌య్యాయి.

D

National | Published On May 12, 2026, 5.18 pm IST

Fire at petrol pump | పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్ర‌మాదం.. 12 మందికి గాయాలు.. కాలిబూడిదైన ద్విచ‌క్ర వాహ‌నాలు
Advertisement

Fire at petrol pump | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ (Madhya Pradesh)లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాజ్‌గ‌ఢ్‌ (Rajgarh) జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది (Fire at petrol pump). ఈ ఘ‌ట‌న‌లో 12 మంది గాయ‌ప‌డ్డారు. ప‌లు వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. సోమ‌వారం రాత్రి ప‌చోర్ ప‌ట్ట‌ణం (Pachore town)లో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు సారంగ్‌పూర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అరవింద్ సింగ్ మంగ‌ళ‌వారం తెలిపారు. గాయ‌ప‌డి వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

పెట్రోల్ బంకులో ఓ బైక్‌కు ఇంధ‌నం నింపుతుండ‌గా అక‌స్మాత్తుగా నిప్పుర‌వ్వ‌లు ఎగ‌సిప‌డ్డాయి. క్ష‌ణాల్లోనే భారీగా మంట‌లు వ్యాపించాయి. అదే స‌మ‌యంలో అక్క‌డే ఫుల్ లోడుతో ఉన్న ఓ డీజిల్ ట్యాంక‌ర్‌కు మంట‌లు అంటుకున్నాయి. అంతే పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. పేలుళ్లు కూడా సంభ‌వించాయి. ఈ ఘ‌ట‌న‌లో డ‌జ‌నుకు పైగా ద్విచ‌క్ర వాహ‌నాలు కాలిబూడిదైన‌ట్లు (motorbikes damaged) పోలీసులు తెలిపారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే మున్సిప‌ల్ చీఫ్ ఆఫీస‌ర్ దీప‌క్ ర‌న్వే ఫైర్ ఇంజ‌న్ల‌తో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. కొన్ని గంట‌ల పాటూ తీవ్రంగా ప్ర‌యత్నించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో.. మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు త‌ర‌లించారు. మ‌రో ఐదుగురిని షాజాపూర్ జిల్లా ఆసుప‌త్రికి రిఫ‌ర్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Also Read..

11 గంట‌ల్లో శ్రీ‌లంక టు భార‌త్‌.. వ‌యా రామసేతు.. స్విమ్మింగ్‌తో బెంగుళూరు జంట వ‌ర‌ల్డ్ రికార్డ్‌

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జె.సి.డి. ప్రభాకర్ ఎన్నిక‌

విజ‌య్ క్రేజ్ మాలూలుగా ఉండ‌దు మ‌రి.. 48 గంట‌ల్లోనే ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్‌

Advertisement
Advertisement