Bengaluru Couple | 11 గంటల్లో శ్రీలంక టు భారత్.. వయా రామసేతు.. స్విమ్మింగ్‌తో బెంగుళూరు జంట వరల్డ్ రికార్డ్
Bengaluru Couple | శ్రీలంక నుంచి భారత్ వరకూ సుమారు 11 గంటల పాటూ స్విమ్మింగ్ చేసి బెంగళూరుకు చెందిన ఓ యువ జంట ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. హిందూ మహాసముద్రంలో చారిత్రక రామసేతు గుండా దాదాపు 32 కిలోమీటర్ల మేర ఈ జంట స్విమ్మింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Bengaluru Couple | బెంగళూరుకు చెందిన ఓ యువ జంట (Bengaluru Couple) అసాధారణ ఘనత సాధించింది. శ్రీలంక నుంచి భారత్ (Sri Lanka to India) వరకూ సుమారు 11 గంటల పాటూ స్విమ్మింగ్ చేసి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, ఈ రెండు దేశాల మధ్య ఈత కొట్టిన తొలి యువ జంటగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. హిందూ మహాసముద్రంలో చారిత్రక రామసేతు (Ram Setu) గుండా దాదాపు 32 కిలోమీటర్ల మేర ఈ జంట స్విమ్మింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
డానిష్ అబ్ది, వృశాలి ప్రసాదె దంపతులు ఈ రికార్డు నెలకొల్పారు. శ్రీలంకలోని తలైమన్నార్ వద్ద మే 7వ తేదీన ఉదయం 4.30 నిమిషాలకు ఈ జంట స్విమ్మింగ్ ప్రారంభించింది. సాయంత్రం 3.15 గంటలకు భారత్‌లోని ధనుష్కోడి (Dhanushkodi) తీరానికి చేరుకుంది. మొత్తం 10 గంటలా 45 నిమిషాల పాటూ వీరి స్విమ్మింగ్ ప్రయాణం సాగింది. బలమైన సముద్ర ప్రవాహాలు, అలలు వంటి ఎన్నో సవాళ్లను అధిగమించి.. ఈ జంట తమ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఆ సమయంలో ఈ జంట కొన్ని జాగ్రత్తలు కూడా పాటించింది. సపోర్టు బోట్లు, పారామెడిక్స్, భారత కోస్టు గార్డు సిబ్బంది సాయంతో వీరు ఈ అసాధారణ ఫీట్‌ను సాధించారు. తమ స్విమ్మింగ్‌కు సంబంధించిన వీడియోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆ జంట ప్రదర్శించిన సాహసం, తెగువ, ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read..
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జె.సి.డి. ప్రభాకర్ ఎన్నిక
జూన్ 2న ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం
ఆంథ్రోపిక్ కు పోటీగా ఓపెన్ఏఐ డే బ్రేక్.. సైబర్ సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఏఐ మోడల్..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






