Delimitation | డీలిమిటేషన్.. ఆ 68 మంది మద్దతే కీలకం
Delimitation | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (womens reservation bill), నారీశక్తి వందన్ చట్టసవరణ, లోక్‌సభ స్థానాల పెంపు (Delimitation Bill) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ మూడు బిల్లుల్లో కీలకమైనది రాజ్యాంగ సవరణ బిల్లు.
Delimitation | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (womens reservation bill), నారీశక్తి వందన్ చట్టసవరణ, లోక్‌సభ స్థానాల పెంపు (Delimitation Bill) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ మూడు బిల్లుల్లో కీలకమైనది రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో భాగంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయి.
అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ బిల్లు పార్లమెంట్‌లో గట్టెక్కుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే కనీసం 360 మంది మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. కానీ, బిల్లు గట్టెక్కాలంటే ఇంకా 68 మంది ఎంపీల మద్దతు అవసరం. ఆ ఓట్లే చాలా కీలకంగా మారాయి. ప్రతిపక్షాలు మద్దతిస్తేనే ఈ బిల్లుకు మెజారిటీ దక్కుతుంది. అయితే, సభకు హాజరైన సభ్యుల్లో 2/3 మెజారిటీ సాధిస్తే సరిపోతుందన్న అంశం కూడా చర్చకు వస్తోంది. ఇదే జరిగితే.. ప్రభుత్వం చేయాల్సింది ఒక్కటే. ఆ 68 మందిని సభకు గైర్హాజరయ్యేలా చూడటమా..? లేకపోతే సభ్యులు సభకు హాజరైనా ఓటింగ్ దూరంగా ఉండేలా చేయడమో చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read..
మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర: కల్వకుంట్ల కవిత
డీలిమిటేషన్ బిల్లు కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్
చారిత్రాత్మక అడుగు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రధాని మోదీ ట్వీట్
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

MP Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాదు.. మేం డీలిమిటేషన్కే వ్యతిరేకం: ఎంపీ చామల
ఏప్రిల్ 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



