Pinarayi Vijayan | అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం విజయన్‌పై చర్యలకు ఆదేశించిన హైకోర్టు
Pinarayi Vijayan | కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసులో (corruption case) కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కేరళ హైకోర్టు (Kerala High Court) అనుమతించింది.
Pinarayi Vijayan | త్రినేత్ర న్యూస్ : కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు భారీ షాక్ తగిలింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసులో (corruption case) విజయన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కేరళ హైకోర్టు (Kerala High Court) అనుమతించింది. అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమర్పించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పినరయి విజయన్‌తోపాటూ ఆయన కుమార్తె వీణ, ఆమె భర్త, మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Exalogic Solutions Pvt Ltd), సీఎమ్ఆర్ఎల్ (Cochin Minerals and Rutile Limited) మధ్య రూ. 1.72 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీ విచారణ జరుపుతోంది. దర్యాప్తులో భాగంగానే పినరయి విజయన్‌తోపాటూ కోజికోడ్‌లోని వీణ భర్త, మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసంలో అధికారులు ఇటీవలే సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్త కుమారుడు శరణ్ కర్త ఇంట్లో కూడా ఈడీ తనిఖీ చేసింది. అనంతరం నివేదికను న్యాయస్థానానికి అందజేసింది. ఈడీ నివేదిక ఆధారంగా వారిపై చర్యలకు కేరళ హైకోర్టు అనుమతించింది.
Also Read..
బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
కొనసాగుతున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. డిపోల్లో ప్రశాంతంగా పోలింగ్
భారతీయ కంపెనీలపై పర్మ్ (PERM) వేటు.. అసలు ఇదేమిటి.. ఉద్యోగులపై ప్రభావం ఎంత?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sabarimala prasadam | శబరిమల ప్రసాదంలో హలాల్ బెల్లం వినియోగం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్టోబర్ 1, 2026

Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!
సెప్టెంబర్ 30, 2026

BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!



