ED Raids | ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు
ED Raids | నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల (CMR) వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ED Raids | త్రినేత్ర న్యూస్: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల (CMR) వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఖానాపూర్, జగిత్యాలలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల (CMR Scam) ఆరోపణలపై సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రేఖానాయక్‌పై సీఎంఆర్ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సత్తెనపల్లిలో ఆమె పేరుతో ఉన్న ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ (ARS Industries) మిల్లులో సుమారు రూ.40.96 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు, రికార్డుల పరిశీలన అనంతరం ఇంత భారీ మొత్తంలో ధాన్యం లెక్కల్లో లోటు ఉన్నట్లుగా తేలింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై గత ఆగస్టులో కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఖానాపూర్‌లోని రేఖానాయక్ నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో ఆమెను అరెస్టు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఈడీ అధికారులు ఆమె నివాసంపై దాడులు నిర్వహించారని, ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో రేఖా నాయక్ అనుచరులు పెద్ద సంఖ్యలో ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొన్నది. కాగా, 2014 నుంచి పదేండ్ల పాటు ఖానాపూర్ ఎమ్మెల్యేగా రేఖా నాయక్ పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ రవాణ శాఖలో (Shyam Naik) ఎంవీఐగా రిటైర్‌మెంట్ తీసుకొని కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2023లో ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తాజావార్తలు
- ●Rahul Gandhi | అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
- ●Rajagopal Reddy | అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు.. సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
- ●Silver Price Crash 2026 | $121 నుంచి $52కి పడిపోయిన వెండి ధర.. 46 ఏళ్ల నాటి చరిత్ర మళ్లీ రిపీట్! వెండి కొనే ముందు ఇవి తెలుసుకోండి
- ●Gold And Silver Prices Today | బంగారం ధరలు ఢమాల్.. ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా తగ్గుదల..
- ●Bank Loan | రూ.1.8 కోట్ల లోన్ ఇచ్చేందుకు రూ.9 లక్షల లంచం.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్
- ●China Gold Buying | బంగారం ధర 34% పడినా ఆగని చైనా వేట.. 8 నెలల్లోనే $159 బిలియన్ల పసిడి కొనుగోలు!

Rahul Gandhi | అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rajagopal Reddy | అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు.. సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Silver Price Crash 2026 | $121 నుంచి $52కి పడిపోయిన వెండి ధర.. 46 ఏళ్ల నాటి చరిత్ర మళ్లీ రిపీట్! వెండి కొనే ముందు ఇవి తెలుసుకోండి

Gold And Silver Prices Today | బంగారం ధరలు ఢమాల్.. ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా తగ్గుదల..






