త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meenakshi Chaudhary | మరో హిట్‌కు రెడీ అయిన మీనాక్షి.. ‘వృషకర్మ’తో 2026కు గ్రాండ్‌ ఎండింగ్‌!

Meenakshi Chaudhary | టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మీనాక్షి చౌదరి.. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. విజయాలు వస్తున్నా.. వరుస ప్రాజెక్టులతో హడావుడి చేయకుండా, కథకు ప్రాధాన్యమిస్తూ అడుగులు వేస్తోంది.

P

Entertainment | Published On Nov 25, 2026, 5.35 pm IST

Meenakshi Chaudhary | మరో హిట్‌కు రెడీ అయిన మీనాక్షి.. ‘వృషకర్మ’తో 2026కు గ్రాండ్‌ ఎండింగ్‌!
Advertisement

Meenakshi Chaudhary | టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మీనాక్షి చౌదరి.. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. విజయాలు వస్తున్నా.. వరుస ప్రాజెక్టులతో హడావుడి చేయకుండా, కథకు ప్రాధాన్యమిస్తూ అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘వృషకర్మ’తో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు పది నెలల విరామం తర్వాత వస్తున్న ఈ సినిమా తన కెరీర్‌కు మరో మంచి విజయాన్ని అందిస్తుందని ఆమె ధీమాగా ఉన్న‌ది.

ప్రమోషన్లలో ఫుల్‌ బిజీ..

సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మీనాక్షి ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాధారణంగా సినిమాల మధ్య ఎక్కువ విరామం తీసుకునే ఈ భామ.. ఈసారి మాత్రం ప్రమోషన్ల కోసం తన షెడ్యూల్‌ను కేటాయిస్తోంది. వరుసగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, టెలివిజన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది. తన పాత్ర, కథాంశం, చిత్ర బృందం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. ‘వృషకర్మ’లో మీనాక్షి పోషిస్తున్న పాత్ర ఆమె గత చిత్రాలకు భిన్నంగా ఉండనుంది. ఇందులో ఆమె ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనుంది. కథలో ఈ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. నాగచైతన్యతో కలిసి తొలిసారి తెరపై కనిపించనున్న ఆమె.. తమ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తోంది. కథలోని ఆసక్తికరమైన అంశాలతో పాటు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తోంది.

కథ, నెరేషన్‌ నచ్చాయంటూ..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి.. సినిమా కథాంశంతో పాటు దర్శకుడు కార్తీక్‌ దండు చెప్పిన కథా విధానంపై ప్రశంసలు కురిపించింది. దర్శకుడి నెరేషన్‌ తనకు బాగా నచ్చిందని, ఇందులో తన పాత్ర ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. పాత్రలోని కొత్తదనం, కథలోని ఆసక్తికరమైన మలుపులు తనను ఈ ప్రాజెక్ట్‌ వైపు ఆకర్షించాయని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. కెరీర్‌లో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న మీనాక్షి.. ‘వృషకర్మ’పై కూడా గట్టి నమ్మకంతో ఉంది. ఈ సినిమా తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేస్తుందని ఆశిస్తోంది. ఈ ఏడాదిని మంచి విజయంతో ముగించాలన్నది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. మరి నాగచైతన్యతో జతకట్టిన ఈ కొత్త ప్రయోగం మీనాక్షికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది? ఆర్కియాలజిస్ట్‌గా ఆమె నటన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది? అన్నది తెరపై చూడాలి. కార్తీక వ‌ర్మ దండు తెర‌కెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, బాపినీడు స‌మ‌ర్పిస్తున్నారు. డిసెంబ‌ర్ 4న ఈ మూవీ విడుద‌ల కానుంది.

Advertisement
Advertisement