త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌కు శుక్ర‌వారం ఊపు వ‌చ్చింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈక్విటీ మార్కెట్ల‌కు ఊతం లభించ‌గా, బులియ‌న్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్‌లో అమెరికాలో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ఇరాన్‌పై దాడులు జ‌ర‌ప‌బోమ‌ని, హోర్ముజ్ ద్వారా చ‌మురు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా క్షీణించాయి.

S

Business | Published On Oct 9, 2026, 11.09 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌కు శుక్ర‌వారం ఊపు వ‌చ్చింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈక్విటీ మార్కెట్ల‌కు ఊతం లభించ‌గా, బులియ‌న్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్‌లో అమెరికాలో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ఇరాన్‌పై దాడులు జ‌ర‌ప‌బోమ‌ని, హోర్ముజ్ ద్వారా చ‌మురు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా క్షీణించాయి. దీంతో ఈక్విటీ, బులియ‌న్ మార్కెట్ల‌లో భారీ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఈ సెష‌న్‌లోనే బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఏకంగా 1.42 శాతం పెరిగి 4,192 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 2.01 శాతం పెరిగి 60 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో సైతం ఊపు క‌నిపించింది. గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1494 పాయింట్లు పెరిగి 1,51,104 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,666 పాయింట్లు పెరిగి 2,24,900 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఒక్క రోజే రూ.11వేల‌కు పైగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,071 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,568 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,710 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,07,100 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.11,400 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,815 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,10,520గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,38,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,81,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,303 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.90,424గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,13,030 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,30,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,500 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement