త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌శ్నించ‌డం కాదు.. స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ఉండాలి.. యువ‌త‌కు ప్ర‌ధాని కీల‌క సూచ‌న‌

PM Modi | వికసిత్ భారత్ సాధనలో యువత పాత్ర కీల‌క‌మ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఉద్ఘాటించారు. ప్రపంచం వేగంగా మారుతోంద‌ని.. టెక్నాలజీతో పాటు ఉద్యోగాలు, పరిశ్రమలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయని చెప్పారు. మారుతున్న కాలానిక‌నుగుణంగా విద్యార్థులు ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

D

National | Published On Aug 8, 2026, 2.02 pm IST

PM Modi | ప్ర‌శ్నించ‌డం కాదు.. స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ఉండాలి.. యువ‌త‌కు ప్ర‌ధాని కీల‌క సూచ‌న‌
Advertisement
  • వికసిత్ భారత్ సాధనలో యువత పాత్ర కీలకం
  • ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ఉద్ఘాటన
  • నీట్ పేప‌ర్ లీక్ వివాదం, సీజేపీ ఆందోళ‌న‌ల త‌ర్వాత‌..
  • తొలిసారి యువ‌త‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : వికసిత్ భారత్ సాధనలో యువత పాత్ర కీల‌క‌మ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఉద్ఘాటించారు. ఢిల్లీ ఐఐటీలో జ‌రిగిన వార్షిక స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను ఉద్దేశించి కీల‌క ప్రసంగం చేశారు. దేశ యువ‌త‌రం సామ‌ర్థ్యాల‌పై త‌మ‌కు పూర్తి విశ్వాసం ఉంద‌న్నారు. ప్రపంచం వేగంగా మారుతోంద‌ని.. టెక్నాలజీతో పాటు ఉద్యోగాలు, పరిశ్రమలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయని చెప్పారు. మారుతున్న కాలానిక‌నుగుణంగా విద్యార్థులు ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

ఐఐటీ దిల్లీ గ్రాడ్యుయేట్లను చూస్తే తనకు గర్వంగా ఉందని ప్ర‌ధాని చెప్పారు. బ‌య‌ట ప్ర‌పంచం చాలా వేగంగా మారుతోంద‌న్నారు. సాంకేతికత, పరిశ్రమలు, ప్రపంచ శక్తి సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయ‌ని తెలిపారు. దీనివ‌ల్ల రాబోయే 20-30 ఏళ్లు ఉలా ఉంటాయో క‌చ్చితంగా అంచ‌నా వేయ‌డం అసాధ్య‌మ‌న్నారు. వేగంగా మారుతున్న నేటి ప్ర‌పంచంలో సాంకేతిక‌త కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని ప్ర‌ధాని చెప్పారు. జీవితంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌ని.. ఆ స‌వాళ్ల‌నే అవ‌కాశాలుగా మ‌లుచుకుని ముందుకు సాగాల‌ని ప్ర‌ధాని సూచించారు. స‌మ‌స్య‌లే మ‌న‌కు ప‌రిష్కారాన్ని కూడా చూపుతాయ‌న్నారు. ఎవ‌రైతే నిరంత‌రం కొత్త విష‌యాలు నేర్చుకుంటారో వారే విజ‌యం సాధిస్తార‌న్నారు. "ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే యువత లక్ష్యం కావాలి" అని దిశా నిర్దేశం చేశారు.

విద్యార్థుల మనసులో రేపటి భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు ఉంటాయని, ప్రతీ ఒక్కరూ ఒక నిర్దిష్టమైన విజన్‌తో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు ‘వికసిత్‌ భారత్‌’ ప్రయాణంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. తాము తీసుకునే ప్రతి నిర్ణయం ముందు అది దేశానికి ఎలా ఉపయోగపడుతుందో యువత ఆలోచించాలని సూచించారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసం మ‌నం ఏం చేయ‌గ‌ల‌మ‌ని ప్ర‌శ్నించుకోవాల‌న్నారు. కేవలం డిగ్రీలు తీసుకోవడమే కాద‌ని, దేశ స్వప్నాలను సాకారం చేసే బాధ్యతను కూడా స్వీకరించాల‌ని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నీట్ పేప‌ర్ లీక్ వివాదం (NEET paper leak), సీజేపీ ఆందోళ‌న‌ల త‌ర్వాత ప్ర‌ధాని విద్యార్థుల‌ను (Gen-Z) ఉద్దేశించి ప్ర‌సంగించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

Also Read..

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదిక‌గా మాట‌ల యుద్ధం

లాయ‌ర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్‌

ఇల్లీగ‌ల్ ఎఫైర్స్‌పై వ‌చ్చిన మ‌ల‌యాళం మూవీ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సాగే థ్రిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే?

Advertisement
Advertisement