త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pilot Rohith Reddy | పైల‌ట్ రోహిత్‌రెడ్డికి షాక్‌.. చెక్‌ బౌన్స్ కేసులో నాన్ బెయిల‌బుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ

Pilot Rohith Reddy | బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్‌రెడ్డికి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. రూ.34.23 లక్షల చెక్‌ బౌన్స్ కేసులో హైదరాబాద్ మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఖుష్బూ ఉపాధ్యాయ ఆయ‌న్ను దోషిగా తేల్చారు.

S

Telangana | Published On Aug 8, 2026, 1.45 pm IST

Pilot Rohith Reddy | పైల‌ట్ రోహిత్‌రెడ్డికి షాక్‌.. చెక్‌ బౌన్స్ కేసులో నాన్ బెయిల‌బుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ
Advertisement

Pilot Rohith Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్‌రెడ్డికి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. రూ.34.23 లక్షల చెక్‌ బౌన్స్ కేసులో హైదరాబాద్ మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఖుష్బూ ఉపాధ్యాయ ఆయ‌న్ను దోషిగా తేల్చారు. తీర్పు సమయంలో నిందితుడు కోర్టులో హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) కూడా జారీ చేశారు.

ఈ కేసుకు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ‘మెసర్స్ ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ వనరులను త‌న‌ వ్యక్తిగత లాభాలకు వాడుకుని కంపెనీకి నష్టం కలిగించారనే ఆరోపణలతో రోహిత్ రెడ్డి 2014లో రాజీనామా చేశారు. ఆ తర్వాత కుదిరిన ఒప్పందం (MOU) ప్రకారం కంపెనీకి రూ.34,23,000 చెల్లించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ చెక్ అంద‌జేశారు. కానీ రోహిత్‌రెడ్డి బ్యాంక్ ఖాతాలో స‌రిప‌డా డబ్బు లేకపోవడంతో స‌ద‌రు చెక్ మూడుసార్లు బౌన్స్ అయింది.

ఈ నేప‌థ్యంలో లీగల్ నోటీసు పంపించినా ఆయ‌న స్పందించకపోవడంతో కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ వ్య‌వ‌హారంపై కోర్టులో విచార‌ణ చేప‌ట్టిన‌ అనంతరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా తేల్చారు. తీర్పు సమయంలో నిందితుడు న్యాయ‌స్థానంలో హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేశారు. త్వరలోనే రోహిత్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన అనంత‌రం శిక్ష వివరాలు వెల్ల‌డించ‌నున్నారు.

మ‌రోవైపు ఇటీవ‌లే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స‌హా మరో తొమ్మిది మంది కొకైన్, మెత్ వంటి మాదకద్రవ్యాలను వాడుతున్నారనే ఆరోపణలపై అతని ఫామ్‌హౌస్‌పై దాడి చేసి అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement