Arvind Kejriwal | ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్
Arvind Kejriwal | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా నిబంధనలపై (new social media law) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయడానికే ఈ నిబంధనలను తెచ్చారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుండా విమర్శలను అణచివేయాలని చూస్తే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హెచ్చరించారు.
Arvind Kejriwal | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా నిబంధనలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సూచించిన పోస్టులను లేదా వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కేవలం మూడు గంటల్లోపే తొలగించాలనే నిబంధనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయడానికేనని ఆరోపించారు.
"మోదీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఒక పోస్టును లేదా వీడియోను తొలగించమని కోరితే.. దాన్ని ఆయా సంస్థలు కేవలం మూడు గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. పేపర్ లీక్‌లు, ఇథనాల్ విధానం, అవినీతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ నిబంధనను ఉపయోగిస్తారు. అదే తమ మద్దతుదారులు చేసే బూతులు, అసభ్యకర పోస్టులపై ఎలాంటి చర్యలూ తీసుకోరు" అని కేజ్రీవాల్ ఆరోపించారు.
జెన్‌జీ నిరసనలతో మోదీలో భయం పుట్టుకుంది
జంతర్ మంతర్ వద్ద ఇటీవలే యువత నేతృత్వంలో జరిగిన నిరసనలు, ప్రదర్శనల తర్వాత ప్రధాని మోదీలో ఆందోళన పెరిగిందని కేజ్రీ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలంటే, ముఖ్యంగా యువత అంటే ఆయనకు భయం పుట్టుకుందన్నారు. ప్రజల గొంతును అణచివేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలే ప్రశంసిస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. సమస్యలను పరిష్కరించకుండా విమర్శలను అణచివేయాలని చూస్తే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హెచ్చరించారు.
విమర్శలను సైతం స్వీకరించే తత్వం ఉండాలి..
ప్రజలను భయపెట్టి అణచివేయాలని చూసే ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నిలవవని హెచ్చరించారు. ప్రజల గొంతును ఎంత నొక్కాలని చూస్తే ప్రజా ఆగ్రహం అంత బలంగా మారుతుందన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజల గొంతును నొక్కేలా ఉండకూడదని కేజ్రీ వ్యాఖ్యానించారు. విమర్శలను సైతం స్వీకరించే తత్వం ఉండాలని సూచించారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తన సోషల్ మీడియా ఖాతాను నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేజ్రీ ప్రస్తావించారు. మెటా సంస్థపై విమర్శలు గుప్పించారు.
కాగా, సోషల్ మీడియాలో చట్టవిరుద్ధమైన లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఐటీ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించే గడువును 36 గంటల నుంచి 3 గంటలకు తగ్గించారు. ప్రభుత్వ లేదా కోర్టు ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు అటువంటి పోస్టులను నిర్దిష్ట సమయ వ్యవధిలోగా తొలగించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని సంస్థలు (Intermediaries) సెక్షన్ 79 కింద లభించే రక్షణను కోల్పోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read..
సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
నేతన్నల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్
పశ్చాత్తాపం లేదు.. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నా : అజింక్య రహానే
సంబంధిత వార్తలు

80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్‌లో ప్రధాని మోదీ, రాహుల్..
సెప్టెంబర్ 10, 2026

Cabinet Decisions | ఏపీ, తెలంగాణలో రైల్వే విస్తరణ.. రూ. 10,021 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
సెప్టెంబర్ 9, 2026

PM Modi | మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం.. బీజేపీ కీలక ప్రకటన
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి
- ●P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?



