Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరగడం ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరగడం ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే వారం ఆరంభంలో బులియన్ మార్కెట్లలో జోరు కనిపించినప్పటికీ పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిశ్రమలోనూ ప్రతికూల సంకేతాలు ఎదురవుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా తగ్గుతున్నాయి. బుధవారం ఒక్క రోజే దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర రూ.9వేలకు పైగా తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ స్పందన ఎదురవుతోంది. ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో 0.17 శాతం పెరిగి 4,341 డాలర్లకు చేరగా, వెండి ధర 0.86 శాతం మేర పతనమై 62 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 846 పాయింట్లకు పైగా పతనమై 1,53,416 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,064 పాయింట్లకు పైగా పతనమై 2,28,400 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,497 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23, 976 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,970 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,49,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,205 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,640గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,050 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,20,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,623 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,984గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,230 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,62,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
అక్టోబర్ 3, 2026

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్గా రాధా మోహన్ సింగ్



