Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
Raja Singh | బీజేపీ (BJP) అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ (Telangana) నేతలకు స్థానం దక్కపోవడం పట్ల ఆ పార్టీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్య రాజాసింగ్ (Raja Singh) విమర్శనాస్త్రాలు సంధించారు.
Raja Singh | త్రినేత్ర.న్యూస్: బీజేపీ (BJP) అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ (Telangana) నేతలకు స్థానం దక్కపోవడం పట్ల ఆ పార్టీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్య రాజాసింగ్ (Raja Singh) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు (Group Politics), ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకుంటారని, అందుకే జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలంటూ హితవు పలికారు.
బీజేపీ అదిష్ఠానం (Nitin Nabin) గత సోమవారం జాతీయ కార్యవర్గాన్ని (New National Team) ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈసారి చోటు దక్కకపోగా, వారి పదవులు కూడా రెన్యువల్ కాలేదు. దీంతో ఓవైపు మిషన్ తెలంగాణ (Mission Telangana) అంటూ 2028లో అధికారమే లక్ష్యమని చెబుతున్న పార్టీ హైకమాండ్.. కీలకమై జాతీయ కమిటీలో మాత్రం రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారు
అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదు
ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలి
- ఎమ్మెల్యే రాజాసింగ్ https://t.co/4X3o0Loj4D pic.twitter.com/46QdQ6GJ94
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
తాజావార్తలు
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్






