త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌కు ఐఎండీ తీపి క‌బురు.. మ‌ళ్లీ జోరందుకోనున్న వాన‌లు..!

TG Weather | తెలంగాణ‌కు వాతావ‌ర‌ణ‌శాఖ తీపిక‌బురు చెప్పింది. అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లుచోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. ఇటీవ‌ల వ‌రుణుడు ముఖం చేశాడు. భానుడి ప్ర‌తాపంతో జ‌నం ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఉద‌యం నుంచే ఎండ‌లు మండుతుండ‌డంతో తీవ్ర ఇబ్బందులుప‌డుతున్నారు.

P

Telangana | Published On Oct 3, 2026, 7.55 pm IST

TG Weather | తెలంగాణ‌కు ఐఎండీ తీపి క‌బురు.. మ‌ళ్లీ జోరందుకోనున్న వాన‌లు..!
Advertisement

TG Weather | తెలంగాణ‌కు వాతావ‌ర‌ణ‌శాఖ తీపిక‌బురు చెప్పింది. అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లుచోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. ఇటీవ‌ల వ‌రుణుడు ముఖం చేశాడు. భానుడి ప్ర‌తాపంతో జ‌నం ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఉద‌యం నుంచే ఎండ‌లు మండుతుండ‌డంతో తీవ్ర ఇబ్బందులుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో మూడురోజుల పాటు వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది. ఆదివారం రాష్ట్ర‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణం పొడిగా ఉంటుంద‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం నుంచి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంట‌కు 30-40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది.

అలాగే, అక్టోబ‌ర్ 6న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. అలాగే, అక్టోబ‌ర్ 7న భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement