త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Black Corridors | జాతీయ ర‌హ‌దారుల‌పై మృత్యు ఘంటికలు.. మూడేళ్ల‌లో 37 వేల మంది మృతి

Black Corridors | గ‌త మూడేళ్ల‌లో జాతీయ ర‌హ‌దారుల‌పై (National Highways) ఉన్న బ్లాక్ కారిడార్స్‌లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో 37,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Jul 23, 2026, 3.11 pm IST

Black Corridors | జాతీయ ర‌హ‌దారుల‌పై మృత్యు ఘంటికలు.. మూడేళ్ల‌లో 37 వేల మంది మృతి
Advertisement

Black Corridors | ప్రమాదకర బ్లాక్ స్పాట్‌లు (Black Corridors), మితిమీరిన వేగం కారణంగా దేశంలోని జాతీయ రహదారులు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. గ‌త మూడేళ్ల‌లో జాతీయ ర‌హ‌దారుల‌పై (National Highways) ఉన్న బ్లాక్ కారిడార్స్‌లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో 37,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని కేంద్రం పార్ల‌మెంట్‌కు తెలిపింది.

రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ (Rajya Sabha MP Sagarika Ghose) అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది. 2023-2025 మ‌ధ్య కాలంలో జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగే (బ్లాక్ కారిడార్స్‌) 6,358 ప్రాంతాల్లో 37,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్ర‌భుత్వం తెలిపింది. మూడేళ్ల కాలంలో ఆయా ప్రాంతాల్లో 37,164 మ‌ర‌ణాలు న‌మోదైన‌ట్లు వెల్ల‌డించింది.

త‌మిళ‌నాడు ఫ‌స్ట్‌..

రాజ్య‌స‌భ‌కు ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన డేటా ప్ర‌కారం.. 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సాంకేతికత, 'ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్' (e-DAR) డేటా ఆధారంగా మొత్తం 6,409.7 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. ఈ జాబితాలో 958 బ్లాక్ కారిడార్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.
ఆ త‌ర్వాత 671 బ్లాక్ కారిడార్లతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో, 607 బ్లాక్ కారిడార్ల‌తో క‌ర్ణాట‌క మూడోస్థానంలో నిలిచాయి. ఇక మహారాష్ట్ర (477), కేరళ (386), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (384) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే త‌మిళ‌నాడులోని విల్లుపురం జిల్లా 70 బ్లాక్ కారిడార్లతో ఫ‌స్ట్‌ప్లేస్‌లో నిలిచింది.

ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

బ్లాక్ కారిడార్స్‌లో ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు కేంద్రం తెలిపింది. రోడ్డు మార్కింగ్‌లు, వార్నింగ్ సైన్ బోర్డులు, క్రాష్ బారియర్లు, రోడ్డు స్ట‌డ్‌లు, అక్ర‌మ డివైడ‌ర్ క‌టింగ్స్ మూసివేత వంటి చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు పేర్కొంది. అంతేకాదు.. జంక్షన్లను మెరుగుపరచడం, నిర్దిష్ట ప్రాంతాల్లో ర‌హ‌దారి వెడ‌ల్పును పెంచ‌డం, అండ‌ర్‌పాస్‌లు, ఓవ‌ర్‌పాస్‌ల నిర్మాణం వంటి శాశ్వ‌త ప‌నులు చేప‌డుతున్న‌ట్లు వివ‌రించింది.

Also Read..

సీజేపీ నిర‌స‌న‌ల వేళ‌ కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం.. NSA కింద ఢిల్లీ పోలీసులకు ప్ర‌త్యేక నిర్బంధ అధికారాలు

ఐప్యాడ్‌, ల్యాప్‌టాప్‌.. రెండింటిలో ఏది ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుంది.. దేన్ని కొనాలి..?

బ‌ర్త్ డే వేడుక‌ల‌కు కేటీఆర్ దూరం.. కార‌ణ‌మిదే..?

Advertisement
Advertisement