iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
iPad Vs Laptop | ప్రస్తుతం టెక్ దిగ్గజ సంస్థలు అధునాతన డివైస్‌లను వినియోగదారులకు అందించడంలో పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే ఒకప్పుడు ల్యాప్‌టాప్‌లలో లభ్యమైన ఫీచర్లకు మించిన సదుపాయాలను ఇప్పుడు ట్యాబ్‌లలోనే అందిస్తున్నాయి.
Technology | Published On Jul 23, 2026, 3.04 pm IST
iPad Vs Laptop | ప్రస్తుతం టెక్ దిగ్గజ సంస్థలు అధునాతన డివైస్‌లను వినియోగదారులకు అందించడంలో పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే ఒకప్పుడు ల్యాప్‌టాప్‌లలో లభ్యమైన ఫీచర్లకు మించిన సదుపాయాలను ఇప్పుడు ట్యాబ్‌లలోనే అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు అధిక బరువు ఉండే ల్యాప్‌టాప్‌లను ప్రయాణాల్లో తీసుకెళ్లడం కన్నా ట్యాబ్‌లను తీసుకెళ్లడమే సులభంగా మారింది. అయితే మార్కెట్‌లో అనేక రకాల ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్న నేపథ్యంలో అసలు ఈ రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది, ఎవరికి ఏది సెట్ అవుతుంది, దేన్ని కొనాలి.. అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఇందుకు టెక్ నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
తేడాలేమిటి..
ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల విషయంలో విండోస్, మాక్ పోటీ పడుతున్నప్పటికీ చవక ధరల కారణంగా చాలా మంది విండోస్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లనే ఉపయోగిస్తున్నారు. అయితే వీడియో ఎడిటింగ్ లాంటి గ్రాఫిక్స్ పనులకు మాక్ పీసీలు సరిగ్గా సెట్ అవుతాయి. సాధారణ అవసరాలకు విండోస్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే ట్యాబ్ లేదా ల్యాప్ టాప్ ఏదైనా సరే వ్యక్తిగత అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం వీడియోలను వీక్షించేందుకు లేదా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలకు ట్యాబ్ సెట్ అవుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అనేక ట్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ మన్నిక, బ్యాటరీ లైఫ్ ఆధారంగా ఐప్యాడ్ సరైన ఎంపికగా నిలుస్తుంది. అలాగే ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్స్, చిన్నపాటి గ్రాఫిక్స్ పనులకు ల్యాప్‌టాప్‌లతో పనిలేదు. ఐప్యాడ్ ఉంటే చాలు. పోర్టబిలిటీ కారణంగా వీటిని ఎక్కడైనా తీసుకెళ్లి సులభంగా పనిచేసుకోవచ్చు. అలాగే యాపిల్‌కు చెందిన మ్యాజిక్ కీబోర్డు, మౌస్ కనెక్టివిటీ ఉంటుంది కనుక ప్రయాణాల్లో పని చాలా సులభతరం అవుతుంది. అలాగే సాధారణ విండోస్ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే ఐప్యాడ్ మోడల్స్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. అందువల్ల ప్రయాణాల్లో ఇవి ఉత్తమంగా పనిచేస్తాయి.
ఏది ఉత్తమం..
పోర్టబిలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, టచ్ స్క్రీన్ సదుపాయం కోరుకునే వారు ఐప్యాడ్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటిల్లో శక్తివంతమైన ప్రాసెసర్, ర్యామ్ ఉంటాయి. దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభిస్తుంది. ఇక సాధారణ పనులకు మించి కంప్యూటింగ్ పనులు, డెస్క్ టాప్ స్థాయి సాఫ్ట్‌వేర్‌లు, విస్తృతమైన మల్టీ టాస్కింగ్, ఏఐ పనులు వంటి అవసరాల కోసం ల్యాప్‌టాప్‌లు ఉత్తమంగా నిలుస్తాయి. అయితే సాధారణ అవసరాలు ఉన్నవారు విండోస్ ల్యాప్‌టాప్‌లను ఎంచుకోవచ్చు. ఇవి చవకగా లభిస్తాయి. అదే భారీ గ్రాఫిక్స్ లేదా కోడింగ్ వంటి పనుల కోసం మాక్ డివైస్‌లు సెట్ అవుతాయి. ఏ డివైస్‌ను కొనుగోలు చేయాలనే విషయం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆయా డివైస్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు
- ●Paradise | నాని ప్యారడైజ్ సినిమాపై నెగెటివ్ పోస్ట్‌లు - కఠిన చర్యలు తప్పవన్న కోర్టు
- ●Ram temple donation theft case | రాముడి పేరును బద్నాం చేయకండి.. విరాళాల చోరీపై కాంగ్రెస్
- ●Jamui Police Encounter | బీహార్ మైనర్ల వేధింపుల కేసు: పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అరెస్ట్
- ●MMTS | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..

iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

Paradise | నాని ప్యారడైజ్ సినిమాపై నెగెటివ్ పోస్ట్‌లు - కఠిన చర్యలు తప్పవన్న కోర్టు

Ram temple donation theft case | రాముడి పేరును బద్నాం చేయకండి.. విరాళాల చోరీపై కాంగ్రెస్

Jamui Police Encounter | బీహార్ మైనర్ల వేధింపుల కేసు: పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అరెస్ట్






