త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Sabha | ప్ర‌ధాన్‌ను తొల‌గించండి.. పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌.. లోక్‌స‌భ సోమ‌వారానికి వాయిదా

Lok Sabha | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Parliament Monsoon Session) ఐదో రోజుకు చేరాయి. నీట్ పేప‌ర్ లీక్‌, దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాలు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష ఎంపీల నిర‌స‌న‌ల‌తో స‌భా కార్య‌క‌లాపాలు ముందుకు సాగ‌డం లేదు.

D

National | Published On Jul 24, 2026, 12.36 pm IST

Lok Sabha | ప్ర‌ధాన్‌ను తొల‌గించండి.. పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌.. లోక్‌స‌భ సోమ‌వారానికి వాయిదా
Advertisement

Lok Sabha | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Parliament Monsoon Session) ఐదో రోజుకు చేరాయి. నీట్ పేప‌ర్ లీక్‌, దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాలు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష ఎంపీల నిర‌స‌న‌ల‌తో స‌భా కార్య‌క‌లాపాలు ముందుకు సాగ‌డం లేదు. వ‌రుస‌గా ఐదో రోజైన శుక్ర‌వారం కూడా ఇండీ కూట‌మి ఎంపీలు (Opposition MPs) పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు.

ఉద‌యం 11 గంట‌ల‌కు లోక్‌స‌భ (Lok Sabha) ప్రారంభం కాగానే ఎంపీలంతా స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను తొల‌గించాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి నినాదాల‌తో స‌భ‌లో తీవ్ర గంద‌రోగ‌ళం నెల‌కొంది. స్పీక‌ర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విప‌క్ష ఎంపీలు వినిపించుకోలేదు.

పోడియం వ‌ద్ద‌కు వెళ్లి త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను మ‌ధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ త‌ర్వాత స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌ కూడా విప‌క్ష ఎంపీలు త‌మ నిర‌స‌ను కొన‌సాగించారు. "విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి", "ఇస్తీఫా, ఇస్తీఫా" (రాజీనామా చేయాలి) అంటూ నినాదాలు చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఎగువ స‌భ‌లోనూ అదేసీన్‌

అటు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. స‌భా కార్య‌లాపాలు ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌తిప‌క్ష ఎంపీలు నిర‌స‌న‌కు దిగ‌డంతో ఎగువ స‌భ‌ను చైర్మ‌న్ 12 గంట‌ల వ‌ర‌కూ వాయిదా వేశారు. స‌భ తిరిగి ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా నిర‌స‌న‌లు కొన‌సాగ‌డంతో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేస్తూ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు.

మ‌ధ్యాహ్నం ఎగువ స‌భ‌లో వందేమాత‌రం బిల్లు ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే (సవరణ) బిల్లు 2026ను ఇవాళ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాజ్య‌స‌భలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. వందేమాతరం, జనగణమన పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించేలా ఈ బిల్లును స‌వ‌ర‌ణ చేశారు.

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విప‌క్ష ఎంపీల ధ‌ర్నా

మ‌రోవైపు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విప‌క్ష ఎంపీలు ధ‌ర్నా కొన‌సాగించారు. మ‌క‌ర‌ద్వారం వ‌ద్ద ఇండీ కూట‌మి ఎంపీల‌తంతా ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళ‌న‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖ‌ర్గే త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement